ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల సమావేశంలో జగన్ చెప్పిన అబద్ధాలే తిరి గి చెప్పాడు. తాను 99 శాతం హామీలు అమలు చేసినట్టు చెప్పడం పెద్ద అబద్ధం. తనకు లేని విలువలు, విశ్వసనీయతను తనకు ఉన్నట్లు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంది. తల్లి, చెల్లి జగన్‌కు విలువలు లేవని స్పష్టం చేశారు. తన అవ లక్షణాలను ఎదుటి వారికి అం టగట్టి.. చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం జగన్ నైజం.
మాట తప్పి మడమ తిప్పిన జగన్
మద్య నిషేధంపై మాట తప్పడమే కాక విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. మెగా డీఎస్సీపై మాట తప్పాడు. సీపీఎస్‌పై మాట తప్పా డు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి మాట తప్పడమే కాక తొమ్మిది సార్లు విద్యు త్ ఛార్జీలు పెంచాడు. పెట్రోల్, డీజిల్ రేట్లు నియంత్రిస్తానని చెప్పి మాట తప్పి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాడు. రైతు భరోసాకు రాష్ట్ర నిధుల నుంచి రూ.12,500 ఇస్తానని మాట తప్పి రూ.7,500లకు కోత కోశాడు. ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే కుదించాడు. పోలవరం నిర్వాసితులకు రూ.19000 ఇస్తానని మోసం చేశాడు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై మాట తప్పాడు. 25 లక్షల ఇళ్లను నిర్మిస్తానని చెప్పి మాట తప్పి సెంటు పట్టాలో రూ.7,000 కోట్లకు పైగా కుంభకోణం చేశాడు. ఇలా 85 శాతం హామీలపై మాట తప్పి మడమ తిప్పాడు. 99 శాతం అమలు చేశానని అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాలు చెప్పడమే కాక విలువలు, విశ్వసనీయత అని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
సూపర్‌సిక్స్ అమలు చేయడని చెప్పేది అబద్ధమే
జగన్ మొదటి ఏడాదే నవరత్నాలు అన్ని అమలు చేయలేదు. మొదటి ఏడాది జగన్ పింఛన్ రూ.250 పెంచగా..చంద్రబాబు ఒకే దఫా పింఛన్ వేయి పెంచారు. కోటి మందికి ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. జూలై నెలలోపు తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలకు రూ.30 వేలు ఇవ్వబోతున్నారు. జగన్ అమ్మఒడికి ఇచ్చింది రూ.13000 మాత్రమే. అన్నదాత సుఖీభవకు రాష్ట్ర నిధుల నుంచి కూటమి ప్రభుత్వం రూ.14000 ఇవ్వబో తోంది. రైతు భరోసాకు జగన్ ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే.. పైగా రైతు రుణమాఫీకి ఎగనామం పెట్టారు. చంద్రన్న ఇప్పటికే 2004 అన్న క్యాంటీన్లు పెట్టారు. రోడ్లను బాగు చేశారు. ఇలా ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 50 శాతానికి పైగా హామీ లు అమలు చేసింది. సూపర్‌సిక్స్ హామీలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేసి తీరుతుంది.
రెడ్‌బుక్ అంటే మాఫియాలకే భయం
జగన్ పాలనలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలు చెలరేగిపోయారు. లక్షల కోట్లు దోచుకున్నారు. ప్రశ్నించిన ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లల్లో తోశారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నందిగామ, ఎర్రగొం డపాలెం, అమరావతి, అంగళ్లు, కుప్పం పర్యటనలపై దాడులు చేశారు. పోలీసు రక్షణ కల్పించకపోగా అక్రమ కేసులు పెట్టారు. లోకేష్ గారి యువగళం పాదయాత్రపై అడు గడుగునా దాడులు చేయడమే కాక వారిపై 23కు పైగా అక్రమ కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతులను కీచకుల్లా హింసించారు. జగన్ పాలనలో ప్రజలు ధన, మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు పాలనలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. మాఫియాలు మాత్రం రెడ్‌బుక్ అంటూ కలవరిస్తున్నారు.
రామగిరి ఎస్సై వీడియో కాల్ అనేది అబద్ధం
తనకు వీడియో కాల్ చేయలేదని పరిటాల సునీతమ్మ కాణిపాకంలో ప్రమాణం చేస్తానని సవాల్ చేసింది. ఆమె సవాల్‌ను స్వీకరించి జగన్ బైబిల్‌పై ఎందుకు ప్రమాణం చేయడం లేదు?
పరిషత్ ఎన్నికలపై గప్పాలు
50కి గాను 39 స్థానాల్లో గెలిచామని జగన్ జబ్బలు చరుచుకుంటున్నారు. ఆయన కు ఆయనే చప్పట్లు కొట్టుకుంటున్నాడు. పరిషత్తులో వైకాపాకు ఉన్న 50 స్థానాల్లో ఉప ఎన్నికల్లో 39 స్థానాలకు తగ్గిపోవడం కోత పడడం కాదా? ఆ స్థానాలు టీడీపీవి కాదు. ఆనాడు ఎన్నికల్లో ప్రతిపక్షాలు నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం చేసి అక్రమంగా వైకాపా ఖాతాలో వేసుకున్నవే. ఉన్న 50లో 11 స్థానాలు కోల్పోయి కూడా అదేదో గొప్ప అంటూ జగన్ గప్పాలు కొట్టుకోవడం ఎవరిని మోసం చేయడానికి? ఇదంతా వైసీపీ కార్యకర్తలకు గాలికొట్టి దిగజారిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఆడే డ్రామా అని అందరికీ తెలుసు. పగిలిపోయిన టైర్‌కు ఎంత గాలి కొట్టినా నిలవదు. కొరివితో తిరిగి తలగోక్కొనేంత అమాయకులు కాదు తెలుగువారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 67% ఓట్లతో ఘన విజయం సాధించిన సంగతి ప్రజలకు తెలుసు.
` గురజాల మాలాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్