అమరావతి (చైతన్య రథం): విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 13, 14 తేదీల్లో మంగళగిరి, యర్రబాలెం గ్రామంలో పర్యటిస్తారు. 13న సాయంత్రం 5.00 గం.లకు మంగళగిరి పట్టణంలోని వీజే కాలేజీ వద్ద టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి కొత్తగా ఏర్పాటుచేసిన సన్‌ఫ్లవర్ హ్యాండ్‌లూమ్స్‌ను ప్రారంభిస్తారు. అదేరోజు అర్థరాత్రి 11.30 గం.లకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొంటారు. 14న ఉదయం 11.00 గం.లకు యర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో పునరుద్ధరించిన గోశాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.00 గం.లకు మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దివ్య రథోత్సవంలో పాల్గొంటారు.