- విద్యార్థి దశలోనే వారి జీవితానికి పునాది వేయాలి
- మెరుగైన ఫలితాలు సాధనే లక్ష్యంగా సమావేశాలు
- పాఠశాలల్లోనూ ఈగిల్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం
- మొబైల్, గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
- విద్యారంగంలో మచిలీపట్నానికి పూర్వవైభవం తెస్తా
- నేషనల్ కాలేజీలో ఇన్నోవేషన్ కేంద్రంగా మారుస్తాం
- జనవరి 2, 3 తేదీల్లో యువ కెరటాలు కార్యక్రమం
- గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం రుస్తుంబాద నగర పాలక బాలికల పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నిర్వ హించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. అలాంటిది ఇద్దరూ కలిసి నిర్ణయా లు తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే కాక వారి భవిష్యత్తుకు బాట లు వేయవచ్చన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివ రించారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదు వుతున్నారు.. ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
డాక్టర్‌ను కావాలని…
డాక్టర్‌ను చేయాలని నా తల్లి తపించినా సాకారం కాలేదు. పేదలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో నందమూరి తారక రామారావు స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంటర్మీడియట్ పిల్లలకు జగన్‌రెడ్డి మధ్యాహ్న భోజనం నిలిపివేస్తే తిరిగి దాన్ని పునరుద్ధరించాం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారి సత్తా ఏంటో కనిపిస్తుంది. ఒకప్పుడు ఐటీకి చంద్రబాబు వేసిన పునాదులే నేటి ఏపీ, తెలంగా ణలో ఇంతమంది ఐటీ ఉద్యోగులకు కారణం. చంద్రబాబు ఎంతమందికి జీవితాన్నిచ్చా రో..మొన్న అరెస్టు చేసినప్పుడు వారందరూ చూపిన కృతఘ్నతకు నిదర్శనం. తొలిసారి గా మహిళలకు యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు.
2,3 తేదీల్లో మచిలీపట్నంలో యువకెరటాలు
తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి..నా స్కూల్, నా టీచర్స్‌కు మంచి పేరు తెచ్చేందుకు కట్టుబడి ఉంటానని ప్రతిన పూని ముందుకు వెళ్లాలి. పుట్టిన ఈ గడ్డకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో అడుగులు వేసినప్పుడే మన జీవితాని కి సార్ధకత లభిస్తుంది. మచిలీపట్నం అంటే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం కలిగి న ప్రాంతం..మళ్లీ పూర్వవైభవం కల్పించేలా మచిలీపట్నం గ్లోబల్ కేపబుల్ కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నా. త్వరలోనే నేషనల్ కాలేజీలో ఇన్నోవేషన్ కేంద్రంగా మచిలీప ట్నం మారుస్తాం. పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించబోతున్నాం. విద్యారం గాన్ని బలోపేతం చేసేందుకు అన్ని రకాలుగా సహకారం అందించబోతున్నాం. జనవరి 2, 3 తేదీల్లో మచిలీపట్నం కేంద్రంగా యువ కెరటాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్ట బోతున్నాం. విద్యార్థులు కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ముందుకురావాలి.
ఎలాంటి సహకారం కావాలన్నా ముందుంటా
మొబైల్ వినియోగానికి విద్యార్థులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో కూడా గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగింది. వాటిని నియంత్రించేందుకు ఈగిల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ లాంటి వాటిపై డేగ కన్ను వేస్తున్నాం. స్కూళ్ల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు కూడా ముందుకు వస్తుండడం అభినందనీయం..వారి సేవలను కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో 98 శాతం ఉత్తీర్ణత రావడం సంతోషంగా ఉం ది.. అంతటితో ఆగిపోకుండా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నానని ఆకాంక్షించారు. ఎలాంటి సహకారం కావాలన్నా అండగా నిలిచేందుకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయ ణ, జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.