- సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల్లే రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు
- అత్యున్నత విధానాలు, వేగంగా అనుమతులు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి నెలకొల్పాయి
- సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- కూటమి ప్రభుత్వ పాలనా సమర్థతకు ఇదే నిదర్శనం
- పెట్టుబడుల ప్రవాహాన్ని ఆపలేకపోయిన వైసీపీ కుట్రలు, పిటిషన్లు
- ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణ వైపు అడుగులు
- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శీ బాలవీరాంజనేయ స్వామి
అమరావతి (చైతన్యరథం): బ్యాంక్ ఆఫ్ బరోడా-సీఎంఐఈ నివేదికలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే నెం.1గా నిలవడం గర్వకారణమని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల న రాష్ట్రానికి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వస్తున్నాయ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పై ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులు ఒక ప్రవాహంలా వచ్చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర నాయక త్వంపై ఏర్పడిన నమ్మకం, విశ్వాసమే, ఐదేళ్ల వైసీపీ హయాంలో విధ్వంస పాలనను చూశాం, పారిశ్రామిక వేత్తలను వేధింపులకు గురిచేశారు. ఫలితంగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. 25 కీలకమైన పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం అమలు చేసింది. ఇవి దేశంలోనే అత్యుత్త మమైన పాలసీలుగా గుర్తింపు పొందాయి. తక్కువ ధర లకు భూముల కేటాయింపు, విద్యుత్ రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వేగవంతమైన అనుమతులు ఇవ్వడం వంటి చర్యలతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభుత్వం తిరిగి సంపా దించిందని మంత్రి డా.స్వామి వివరించారు.
వైసీపీ కుయుక్తులకు తలొగ్గని పెట్టుబడిదారులు
పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్ని సార్లు కోర్టులకు వెళ్లినా, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ను ఆపలేకపోయారు. రాబోయే 15-20 సంవత్సరాల పాటుకూడా ఈసుస్థిర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంపై ఉన్న విశ్వాసంతోనే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తా యనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, యువనేత లోకేష్ పట్టుదల కలగ లిపి దేశవిదేశాల్లోని పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయి. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల సహకారంతో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం కూడా పెట్టుబడిదారులకు భరోసా కలిగిస్తోంది. ఈ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహి స్తుందనే నమ్మకంతోనే పెట్టుబడులు ఏపీ వైపు తరలి వస్తున్నాయని స్పష్టం చేశారు.
దేశంలో సింహభాగం పెట్టుబడులు ఏపీకే
బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గత తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలవడం, తర్వాతి స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్రలు మన నాయకత్వంపై పారిశ్రామికవేత్తల్లో ఉండటం -ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. ఇదే కాకుండా గత ఏడాదిలో “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక కావడం గర్వకారణం. జాతీయ స్థాయి మీడి యా కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకుని అందిం చిన ఈ గౌరవం, ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ప్రభు త్వం తీసుకున్న సంస్కరణలు ఎంత ప్రభావవంత మైనవో చూపిస్తోందన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనం
గత నవంబర్ లో విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా సుమారు రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడు లను ఆకర్షించగలిగాం. యువగళం మేనిఫెస్టోలో చెప్పి నట్లు 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ పెట్టుబ డులు కీలకంగా మారనున్నాయి. స్టెబిలిటీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్సులు, సింగిల్ విండో విధానం పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సద స్సులో నేను కూడాపలువురు పారిశ్రామికవేత్తలను కలి సినప్పుడు, ప్రభుత్వ విధానాలు మరియు వేగవంతమైన అనుమతులే తమను ఆకర్షించాయని వారు స్పష్టంగా తెలిపారు. నేడు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అమరావతిలో దక్షిణాసియాలోనే తొలి క్వాంటం వ్యాలీని నిర్మించేందు కు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వా ములవుతున్నాయి. రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి చెందింది. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయే పరిస్థితి నుంచి, ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమలు ఏపీకి తరలివచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చాం. కేవలం 18నెలల్లోనే రూ.25లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలగడం ప్రభుత్వ కృషి, పట్టుదలకు నిదర్శ నమని మంత్రి డా. స్వామి స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా..
సంక్షేమాన్ని అమలు చేస్తూనే, గత పాలకులు చేసిన అప్పులను తీర్చుకుంటూ అభివృద్ధి మార్గంలో రాష్ట్రం ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 ఏళ్ల పరిపాలనా అనుభవం, సమర్థ నాయకత్వం దీనికి బలమైన మద్దతుగా నిలిచాయి. ముఖ్యమంత్రి స్పీడ్ను అందుకోవడం కష్టమని, ప్రతి రోజు ఆయన నుంచి కొత్త ఆలోచనలు నేర్చుకుంటున్నామని అధికారులే చెబుతున్నారు. రిన్యూవబుల్ ఎనర్జీ, పవర్, కెమికల్స్, మోటార్స్ వంటి రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు పరిశ్రమలకు మరింత ఊతమిచ్చాయి. గూగుల్, బీపీసీ ఎల్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, రిలయన్స్ బయోగ్యాస్, డేటా సెంటర్లు, ఎస్ఏఐఎల్ వంటి సంస్థల పెట్టుబడు లు రాష్ట్రానికి రావడం ఇందుకు నిదర్శనం. రాబోయే దావోస్ పర్యటనలో కూడా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రా నికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పెట్టుబడుల ఒప్పం దాలన్నీ అమలైతే ఆంధ్రప్రదేశ్ను ఎవ్వరూ ఆపలేరని గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలే అంగీ కరించడం విశేషం. ఎవరు ఎంత విమర్శించినా, రాష్ట్ర పురోగతిని ఆపలేరు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైన్యూర్ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయని మంత్రి. డా.స్వామి తెలిపారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా – సీఎంఐఈ నివేదికలో దేశం *లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం మనందరికీ గర్వకారణమని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు.
















