- బలహీనవర్గాలకు జగన్ రెడ్డి ద్రోహం బబిసి, ఎస్సీలకు సంక్షేమపథకాలను పునరుద్దరిస్తాం
- చింతలపూడి సభలో చంద్రబాబునాయుడు
- ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి
ఏలూరు : తప్పుడు మాటలతో సామాజిక న్యాయం గురించి నాపై ఆరోపించినవారు ముక్కు నేలకు రాయాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో బుధ వారం రాత్రి ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సామాజిక న్యాయానికి మారుపేరుగా పనిచేస్తే నాపై కుల ముద్ర వేశారు.ఇప్పుడు అందరినీ తన సామాజిక వర్గం..సొంత జిల్లావారినే నియమించుకున్నారు. మం త్రులు, సీఎస్, డీజీపీ, సలహాదారువంటి నామినేటెడ్ పోస్టుల్లో నియమించారని ధ్వజమెత్తారు. వెనుకబడిన వర్గాలే తెలుగుదేశంపార్టీ వెన్నెముక,వడ్దీతోసహా వారు కోల్పోయిన నిధులు ఖర్చు చేసి అండగా నిలుస్తామని అన్నారు. ఎస్సీలకు రద్దుచేసిన 28 సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల కు ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏవనరు కనిపించినా వైసిపి దొంగలు దోపి డీకి సిద్ధమవుతున్నారు,దోచుకోవడానికి విశాఖభూము లు వైసీపీ నేతలకు తేలిగ్గా కనిపించాయని అన్నారు. జగన్ వంటి రాక్షసుడితో పోరాడాలనే అలిపిరి ఘటన లో శ్రీవారు నాకు ప్రాణభిక్ష పెట్టారు, రాబోయేది టీడీపీ ప్రభుత్వం.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోనని స్పష్టంచేశారు.
నా మాదిరిగా ప్రజల్లోకి రా చూద్దాం
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ డబ్బులతో మీటింగ్ లు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించడం కాదు… నామాదిరిగా ప్రజల్లోకి వచ్చి మీటింగ్‌లుపెట్టు.. అప్పు డు నీపరిస్థితి ఏంటోచూద్దామని చంద్రబాబునాయుడు సవాల్‌చేశారు. పరదాలు కట్టుకుని తిరగడం.. ప్రజల పై కేసులు పెట్టడమేనా నీపని…కావాలని తప్పుడు కేసులు పెడితే ఎలా స్పందించాలో అలా స్పందిస్తాం.. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చా రు.రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచా లి,దమ్ము,ధైర్యంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నా రు. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా చేశారు, ఇదేం ఖర్మ మా పంచాయతీలకంటూ వైసీపీ సర్పంచ్‌లే అం టున్నారు, మళ్లీ నేనొస్తా..సర్పంచ్‌లకు నిధులు, అధి కారాలిస్తానని తెలిపారు.ప్రజలు చైతన్యవంతులై మోస గాళ్లకు సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
విద్యార్థులతో ముఖాముఖి
ధర్మాజీగూడెంలో చంద్రబాబునాయుడు విద్యార్థు లతో ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రజలను మోసంచేసి జగన్ అధికారంలోకి వచ్చారని, మీతో పాటు తర్వాత వారి భవిష్యత్తు కోసం ఆలోచించాల న్నారు. అభివృద్ధి చేయాల్సిన పాలకుడు విధ్వంసం చేస్తున్నాడు, భవిష్యత్తు తరాల పరిస్థితిపై విద్యార్థులు ఆలోచన చేయాలని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుం టారో, బలిపశువులవుతారో మీ చేతుల్లోనే ఉందన్నా రు. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కానీ బలిపశువులు కాబో మని విద్యార్థుల నినాదాలు చేశారు. పారిశ్రామి కాభివృద్ధి, సాగులో ఏది ముఖ్యమని ప్రశ్నించిన మరో విద్యార్థికి చంద్రబాబునాయుడు సమాధానమిస్తూ నా లెడ్జ్ ఎకానమీ అన్నింటి కంటే ముఖ్యమనదని తెలి పారు. వ్యవసాయం లేనిదే ఆహారం ఉండదన్న చంద్ర బాబు… పరిశ్రమలు లేకుంటే ఏ వస్తువులూ ఉండవ ని అన్నారు. బోధనా రుసుము అందక ఇబ్బంది పడు తున్నామన్న మరో విద్యార్థిని మాటలపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ విద్యార్థుల చదువులకు దోహదపడే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తప్పుచేసిన వారిని చిత్తగొట్టండి
జగన్ మాయలపై ప్రజలు కర్రలు తీసుకుని రడీగా ఉండాలి. తప్పులు చెప్పే వారిని చితక్కొట్టాలి. నేను అన్నా క్యాంటీన్ పెట్టాను…పేదలకు కడుపునిం డా భోజనం పెట్టే క్యాంటీన్ ను ఈ ముఖ్యమంత్రి తీసేశాడు. పది మందికి తిండిపెట్టే అన్నా క్యాంటీన్ పైనా మీ కోపం..? అన్నా క్యాంటీన్ ను మళ్లీ తిరిగి ప్రారంభిద్దాం. కుర్చీలు బెంచీలు లేని కార్పోరేషన్లు ఎందుకు….ఒక్కరికి అయినా కార్పొరేషన్ ల నుంచి సాయం చేశారా.? వెనుకబడిన వర్గాలు ఆలోచిం చాలి…. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?
తాటాకు చప్పుళ్లకు భయపడతామా?
సాక్షి గుమస్తా చెప్పాడని…అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే తమ్ముడు నన్నుచంపేస్తా అని చెబుతున్నాడు. అనుకుని ఉంటే నన్ను, లోకేష్‌ను చంపేసే వాళ్లమని వైసిపి ఆకురౌడీలు అంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడం. బాబాయిని చంపిన వాడిని పట్టుకోలేని ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వం… ఎవరు తప్పుచేసినా వారి తాటతీస్తా. పోలీసులు మంచి వాళ్లే… కానీ కొందరు మాత్రం నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్నారు. అన్నింటికీ అంతకంతా తిరిగిచెల్లిస్తాం. సుదీర్ఘకాలం నేను ముఖ్య మంత్రిగా ఉన్నాను..మళ్లీగెలిస్తే ముఖ్యమంత్రి అవుతా ను. కానీ నా పోరాటం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం.
ప్రజలు భయపడితే రాష్ట్రం మిగలదు
జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించేంధుకు ప్రజలు భయపడితే బానిసలుగా మిగిలిపోతారు. తిర గబడకపోతే రాష్ట్ర భవిష్యత్ మిగలదు. వైసిపి ఎమ్మె ల్యేలు దోపిడీ దారులుగా తయారు అయ్యారు. ఇసుక మట్టి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వైసిపి నేతలు పోలీసులు,వాలంటీర్లు లేకుండా బయటకు పోతున్నా రా.? సిఎం పరదాలు కట్టుకుని పర్యటనలు చేస్తున్నా డు. ఆడవాళ్ల చున్నీలు నల్లగా ఉన్నాయని సిఎం మీ టింగ్‌లో వాటినితీయించాడు.ఆడవాళ్ల చున్నీలు కూడా చూసి జగన్ భయపడుతున్నాడు. జగన్‌కు ధైర్యం ఉం టే నాలా ప్రజల్లో మీటింగ్ పెట్టే ధైర్యంఉందా? పరదాలు కట్టుకుని తిరిగే సిఎం అందరిపై కేసులు పెడుతున్నాడు.ఇప్పటంవారిపై కేసులు,పవన్ కళ్యాన్ పైకూడా కేసులుపెట్టారు.ఈరాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఇక భయటకు రండి. ధైర్యంగాఫైట్ చెయ్యండి.
వైసిపిని చిత్తుచిత్తుగా ఓడిరచాలి
వైసిపిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని ప్రజలు ప్రతిజ్క్ష చెయ్యాలి. ప్రభుత్వంపై పోరాడటానికి టీడీపీకి ప్రజలు మద్దతుగా తరలిరావాలి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నట్లు…నేడు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజ లు కదలి రావాలి. సుప్రీం కోర్టులో రాజధాని గురించి ఏం చెప్పారు? రాజధానిమార్చడం లేదు అని కోర్టుకు చెప్పారు. మూడు రాజధానులు అని ఎందుకు చెప్ప లేదు? మీ ఊళ్లో రోడ్డు వెయ్యలేని సిఎం… రాష్ట్రానికి మూడు రాజధానులు కడతాను అంటున్నాడు. ప్రతి ఒక్కరు ఇక సైకిల్ ఎక్కాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యానికి, ఆదాయానికి సైకిల్ మంచిది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తొలిరోజు పర్యటనకు జనం వెల్లువెత్తారు. మూడురోజుల పర్యటనలో భాగంగా చంద్రన్న తొలిరోజైన బుధవారం దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షోలకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ గేట్ వద్దకు అధినేత చేరుకోగానే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో అభిమానులు చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలతో సత్కరిస్తూ దారిపొడవునా పూలతివాచీ పరిచారు. జై చంద్రన్న, జై తెలుగుదేశం నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఏలూరు శివార్ల నుంచి బైపాస్ మీదుగా దెందులూరు నియోజకవర్గం విజయరాయివరకు సుమారు 80కిలోమీటర్ల మేర చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్నంత సేపు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పట్టారు. జయహో చంద్రన్న నినాదాలతో పరిసరాలు దద్దరిల్లాయి. అడుగడుగునా కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కలపర్రు టోల్ గేట్ నుండి జంగారెడ్డిగూడెం సమీపంలోని నరసన్నపాలెం వరకూ ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ప్రభంజనంలా సాగింది. పూర్వపు పశ్చిమ గోదావరి నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు గోదావరి వరద ప్రవాహంలా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విజయరాయి, వాసాలపల్లి క్రాస్ రోడ్, లింగపాలెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలలో జరిగిన సభల్లో మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభకు ఇసకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. విజయరాయి గ్రామంలో వీధులన్నీ కిటకిటలాడాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ ప్రారంభం అనంతరం పలువురి ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక ప్రశ్నావళిలోని ప్రశ్నలను అడిగి స్థానికులనుంచి సమాధానాలు రాబట్టారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరిని లండన్ బాబు అంటూ చంద్రన్న చురకలు వేసినపుడల్లా జనం కేరింతలు కొట్టారు. తన పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ దెందులూరు ఎమ్మెల్యేపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇలాంటి వేషాలు వేస్తే లండన్ బాబును మళ్లీ లండన్ పంపుతామని హెచ్చరించారు. ప్రవాహంలా తరలివచ్చిన జనాన్ని చూసి ఆనందంతో మురిసిపోయిన చంద్రబాబునాయుడు సభల్లో మాట్లాడుతూ… పశ్చిమ గోదావరిలో నాకు ఘనస్వాగతం పలికారు.ఈ స్పందన చూసిన తరువాత ఇక ఏ అనుమానం లేదు. రాబోయే ఎన్నికల్లో 2014 ఎన్నికలకు మించిన ఫలితాలు రావడం ఖాయమన్నారు. వందలసార్లు తాను ఈ జిల్లాకు వచ్చినా గతంలో ఎన్నడూ ప్రజలనుంచి ఇంతటి స్పందన చూడలేదన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు ఈ జనం నిదర్శనమని అన్నారు. తొలిరోజు పర్యటనలో చంద్రబాబునాయుడు సభలకు వచ్చిన జనసందోహంపై ఇంటిలిజెన్స్ ద్వారా అందిన నివేదికలు చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు చెలరేగాయి. రాబోయే రెండురోజల్లోకూడా లక్షల్లో జనం హాజరయ్యే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొనడంతో వైసిపి నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. చంద్రన్న సభలకు హాజరవుతున్న జనం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు సంకేతంగా కన్పిస్తోంది.