అమరావతి (చైతన్య రథం): పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, ఆవిష్కరణలకు ప్రధాన గమ్యస్థానంగా మారుస్తూనే ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ (సీబీజీ)కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది బయో ఇంధన రంగానికి ఒక ముఖ్యమైన ముందడుగన్నారు. రాబోయే ఐదేళ్లలో రిలయన్స్ 500 సీబీజీ ప్లాంట్లను స్థాపించి, బంజరు భూమిని ఆకుపచ్చ ఎరువులతో ఉత్పాదక వ్యవసాయ భూమిగా మారుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.