- దావోస్ పర్యటనలో మంచి ఫలితాలు
- జగన్‌రెడ్డి బిల్డప్ ఏపీగా మార్చారు
- వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన విజయవం తం సంతోషకరమని వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అంచనాలకు మించి పెట్టుబడులతో తిరిగి రావడం చాలా శుభపరిణామమని పేర్కొన్నారు. ఆరు నెలల పాలన చూసి పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో మా వినూ త్న ఆలోచనలు, సులభతర విధానాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, సింగిల్ ఎండో విధానంలో అనుమతులు ప్రపంచ పారిశ్రామిక వేత్తలను రాష్ట్రం వైపు ఆకర్షితులయ్యేలా చేసిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎముకలు కోరికే -60 డిగ్రీల చలిని సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో పారి శ్రామిక విప్లవం తేవడానికి దావోస్ నడివీధుల్లో చంద్రబాబు, లోకేష్ పడిన శ్రమ మంచి ఫలితాలు అందిస్తుందని ప్రశంసించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో పాటు అనేకమంది పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు దూరదృష్టిని మెచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్ట డానికి స్పష్టమైన హామలు ఇచ్చారు. 7,93,967 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకా రం తెలిపారు. పర్యాటక రంగంలో మరో రూ.6,178 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా 4,51,906 మందికి, పరోక్షంగా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. 2014లో విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులను నిర్వహించి దావోస్, దక్షిణకొరియా వంటి దేశాలలో పర్యటించి అన్ని రంగాలలో కలిపి రూ.11.77 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఏపీని బ్రాండ్ ఏప్గా తీర్చిదిద్దితే 2019లో జగన్ రెడ్డి బిల్డప్ ఏపీగా మార్చారని…తిరిగి సన్‌రైజ్ ఏపీగా చంద్రబాబు మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చి వాటి కార్యకలా పా లను ప్రారంభించాయి. ఇది ముఖ్యమంత్రి మానసపుత్రిక విజన్ 2047 విజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.
చంద్రబాబు విజన్‌కు నిదర్శనం: అజీజ్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి దా వోస్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పడిన శ్రమ సత్ఫలితాలనిచ్చిం దని ఏపీ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు చంద్రబాబు విజన్‌ను మెచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం విజన్ 2047 విజయాన్ని సూచిస్తుందన్నారు. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల ను కమీషన్ల కోసం కక్కుర్తిపడి జగన్‌రెడ్డి తరిమేశాడు. బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రా న్ని బిల్డప్ ఏపీగా జగన్‌రెడ్డి మారిస్తే..తిరిగి సన్‌రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారని ప్రశంసించారు.