- వివిధ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- కీలక పాలసీలలో సవరణలకు ఓకే
- విద్యుత్ సహా పలు విభాగాలకు రాయితీలు
- నీరు`చెట్టు పెండిరగ్ బిల్లుల చెల్లింపునకు ఓకే
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ
- నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి పెట్టుబడుల ప్రవాహం మొదలైందని, పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు వెల్లడిరచారు. ఇప్పటివరకూ రూ.6,78,345కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 34 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దీంతో 4,28,705మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయని మంత్రి కొలుసు వెల్లడిరచారు.
పరిశ్రమలు మరియు వాణిజ్యం
2024-29 ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించిన పలు పాలసీల సవరణలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఎంఎస్‌ఎంఈ, ఎంఈడీపీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేలా పాలసీల్లో సవరణలకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ప్రోత్సాహాలను (35శాతం పెట్టుబడి రాయితీని 45శాతానికి) పెంచండం, ఇప్పటివరకూ మాన్యుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్‌కు ఈ పెట్టుబడి రాయితీ అందజేయడం జరుగుతుంటే, ఇకపై రవాణా, లాజిస్టిక్స్ ఆక్టివిటీస్‌కూ 45శాతం రాయితీ గరిష్టంగా రూ.75 లక్షల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది.
కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికే ఈ పెట్టుబడి రాయితీలు వర్తిస్తాయి. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు భూమి విలువపై 50 శాతం రాయితీని గరిష్టంగా రూ.2 లక్షలు ఇవ్వడం జరిగేది. కానీ నేడు తీసుకున్న నిర్ణయం ప్రకారం 75 శాతం రాయితీని గరిష్టంగా రూ.25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే, ఎంఎస్‌ఎంఈ డీపీ-4.0 పాలసీలో మహిళలు, బీసీ, విభిన్న ప్రతిభావంతులకు ఆరేళ్లపాటు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్‌కు రూపాయి ఇవ్వడం జరిగేది. ఎస్పీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్‌కు రూ.1.50లు ఐదేళ్లపాటు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అన్ని వర్గాలకూ.. అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు విభిన్న ప్రతిభావంతులకు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్‌కూ రూ.1.5 ఐదేళ్లపాటు ఇవ్వనున్నారు. స్టేట్ జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ప్రోత్సాహాన్ని ఐదేళ్లపాటు అన్ని వర్గాలకూ అమలు చేయనున్నారు. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది.
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎలీప్, ఇఎంసి (కొప్పర్తి) తదితర కంపెనీల విజ్ఞప్తి మేరకు కొన్ని ప్రోత్సాహకాలు అందించే అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రెవిన్యూ వివాదాల పరిష్కార అధికారాలను డీఆర్‌వోల నుంచి ఆర్డీవోలకు దఖలుపరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో నీరు`చెట్టు కింద చేపట్టిన పనుల పెండిరగ్ బిల్లుల చెల్లింపునకు కేబినెట్ ఆమోదించింది. అలాగే, నీరు`చెట్టు పనులు అమలుచేసిన 386మంది ఇంజనీర్లపై గత ప్రభుత్వం చేపట్టిన క్రమశిక్షణా చర్యల ఉపసంహరణకూ కేబినెట్ ఓకే చెప్పింది. పెండిరగ్ బిల్లుల మొత్తం రూ.50.56 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. సీఆర్‌డీఏ పరిధిలో, జల్ జీవన్ మిషన్ పనులు, అమృత్, జలవనరుల శాఖలో దాదాపు లక్ష కోట్ల అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ఇన్ని పనులొ నిర్వహణకు ప్రీ క్వాలిఫికేషన్ కాంట్రాక్టర్లు దొరడకం కష్టమనే నేపథ్యంలో.. బిడ్ సామర్థ్యంలో ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన నియమం అన్ని శాఖలకూ వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
పోలవరం ప్రాజెక్టులోని ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో హౌసింగ్ బ్యాలెన్స్ పనుల కోసం తాజాగా టెండర్లు పిలవడానికి. ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసేందుకు, ధరల సర్దుబాటు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెల్పింది. 2027కల్లా ప్రాజక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో నిర్వాశితులకు సత్వరమే న్యాయం చేయాలని నిర్ణయించింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిర్మించే దాదాపు 50 హౌసింగ్ కాలనీల్లో అన్ని మౌలిక వసతుల కల్పనతోపాటు సామాజిక మౌలిక సదుపాయాలనూ కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తితిదేలో పోటు కార్మికులకు సంబంధించిన 15 పోస్టులను సూపర్వైజర్ స్థాయికి పెంచేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా తమ్మినపట్నం, కొత్తపట్నంలో చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పరిహారం కింద ఎకరాకు రూ.8లక్షలు చొప్పున దాదాపు రూ.79కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. మద్యం ధరలపై క్యాబినెట్‌లో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ మరియు కెపాసిటీ బిల్డింగ్ పాలసీ 2025 ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రం మరియు ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని క్రమంగా తగ్గించాలనే లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా ఇంధన శాఖ చేసిన పలు ప్రతిపాదలను నేడు మంత్రి మండలి ఆమోదించింది. 3,200 మెగా వాట్ల సోలార్ పవర్ కెపాసిటీని కేటాయించాలని పలు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తద్వారా దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడులు, 3,500 ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. ఇంతకు ముందు కేటాయించని ప్రాంతాల్లో సోలార్ పవర్ కెపాసిటీని కేటాయించనుంది. ఇక, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు రూ.45వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు.