- 2020లో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో నిర్వాకాలు
- ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు, మందులలో లోపాలు
- గత ప్రభుత్వ అవినీతికి అద్దంపట్టిన ఏసీబీ నివేదిక
అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో అక్రమాలు, వైద్యసేవల నాణ్యత లోపించడం పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కూటమి అధికారంలోకి రాగా వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పరిస్థితిని మార్చడానికి గత ఏడాది కాలంగా తరచుగా సమీక్షలు నిర్వహిస్తుండడంతో కొంతమేర మార్పు కనిపించింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో పలు అక్రమాలకు పాల్పడిన 22 మంది వైద్యులు, నర్సులపై శీఘ్రగతిన విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. వివరాలను పరిశీలిస్తే అనకాపల్లి ఆసుపత్రిలో పలు అక్రమాలు జరుగుతున్నాయన్న విశ్వ సనీయ సమాచారంతో 2020 ఫిబ్రవరిలో ఏసీబీ ఆకస్మిక తనిఖీ చేపట్టి పలు అక్రమాలపై నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మేర కు క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు అప్పటి డీసీహెచ్‌ఎస్(డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్), మరో తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులపై శీఘ్రగతిన విచారణ చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
అక్రమాలు, వైఫల్యాలు
లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహణ, భోజనం అందించాల్సిన రోగుల వివరాలు తెలపకపోవడం, ఆహార సరఫరా నాణ్యతపై నిర్లక్ష్యం, నియమాలకు భిన్నంగా సివిల్ పనులు కట్టబెట్టడం, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరును నియంత్రించకపోవడం, సరైన పర్యవేక్షణ చేయడంలో పూర్తిగా విఫలమైన అప్పటి డీసీహెచ్‌ఎస్ పై మేజర్ పెనాల్టీ విధించేందుకు విచారణ చేపట్టాలని ఏసీబీ అధి కారులు ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన తమ నివేదికలో సూచించా రు. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు విధుల నిర్వ హణలో వైఫల్యం చెందిన మరో 9 మంది వైద్యులపై కూడా క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని ఏసీబీ సిఫారసు చేసింది. 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులపై కూడా క్రమశిక్షణా చర్యలు చేప ట్టాలని ఏసీబీ కోరింది. ఇన్‌పేషెంట్లను ఎక్కువగా చూపడంతో పాటు, రోగులకిచ్చే భోజనం నాణ్యతపై నిర్లక్ష్యం, డైట్ చార్ట్‌ను ప్రదర్శించకపోవడం, మందుల సరఫరా వినియోగం వివరాలు సరిగా చూపకపోవడం, తమ విధులను సరిగా నిర్వహించక పోవ డం వంటి లోపాల కారణంగా వీరిపై చర్యలు చేపట్టాలని తమ నివేదికలో సూచించారు. ఆ నివేదిక మేరకు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పాటు రూ.74,000 మేరకు వాహన ఇంధనం వినియోగంలో తప్పుడు లెక్కలు చూపిన డ్రైవరు, డ్రెస్సింగ్ పనులు చేసిన కాంట్రాక్టు శానిటేషన్ వర్కర్‌పై కూడా తగు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
కూటమి ఏడాది పాలనలో మార్పులు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్ ఆసుపత్రు లలో మార్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైద్య సిబ్బంది హాజరు, రోజువారీ ఓపీ సేవల నిర్వహణ, అవినీతిని అరికట్ట డానికి చేపట్టాల్సిన చర్యలపై రోజూ సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నతా ధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు. ఫలితంగా వైద్యుల హాజరు, వివిధ సేవల నిర్వహణ, డయాగ్నోస్టిక్ పరీక్షలు, పడకల వినియో గం వంటి విషయాల్లో స్పష్టమైన మార్పు కన్పించింది. క్షేత్ర స్థాయి లో వివిధ ఆరోగ్య పథకాల అమలు, వైద్య సిబ్బంది పనితీరు పర్యవేక్షణ వంటి విషయాల్లో జిల్లా స్థాయి అధికారులైన డీఎంహె చ్వోలు, డీసీహెచ్‌ఎస్ అధికారులనే బాధ్యులను చేస్తామని, నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతేడాదిలో పనితీరు ఆధారంగా పలువురు జిల్లా స్థాయి వైద్యాధికారుల నియా మకాలు చేశారు. సరిగా పనిచేయని వారిని తొలగించి స్పష్టమైన సందేశాన్నిచ్చారు. అక్రమాల్ని అరికట్టే దిశగా ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, అకౌంటెంట్లు వంటి వారిని వేరే కార్యాల యాలకు బదిలీలు చేశారు. ఉన్నత స్థాయిలో పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లను కూడా ప్రతిభ ఆధారంగా మార్చడం, నియమించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వెల్లడిస్తూ ఏసీబీ ఇచ్చిన నివేదిక నేపథ్యం లో ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు తెచ్చేందుకు మరింత పటిష్టమైన చర్యల్ని చేపట్టాలని ఆదేశించారు.