ముంబయి (చైతన్యరథం): ఏపీలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్తో మంత్రి నారా లోకేష్ ముంబయిలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా పవర్ రెన్యూవబుల్స్ సీఈవో సంజయ్ కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ ఛత్వాల్, టాటా ఎలక్సి సీఈవో మనోజ్ రాఘవన్, టాటా ఆటో కాంప్ సీఈవో మనోజ్ కోల్హాత్కర్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సీఈవో సుకరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్. ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఈవో వినాయక్ పాయ్, ఎస్టి టి టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈవో బిమల్ ఖండేల్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో రాష్ట్ర అగ్రనేతల సమక్షాన ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారిని ఆహ్వానించారు.
టాటా పవర్ రెన్యూవబుల్స్ (Tata Power Renewables) రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రూఫ్ టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాన్ని అన్వేషించాలని, రాష్ట్రంలో సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో టాటా ఎల్బీ (Tata Elxsi) రీజనల్ ఆఫీస్/ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, తూర్పుతీరంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ డిఫైండ్ వెహికిల్స్ (SDVs), అటానమస్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీస్, ఖూఎ, Gen Al ఆధారిత మొబిలిటీ లేదా మెడ్క్ ఇన్నోవేషన్ల వంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
శ్రీసిటీలో ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి
టాటా ఆటోకాంప్ (Tata AutoComp) ఆధ్వర్యాన శ్రీసిటీలో ఎలక్ట్రిక్ వాహన భాగాలు, అధునాతన కంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించే అవకాశాలను అన్వేషించండి. ఇందుకు అవసరమైన భూమి, ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వం అందిస్తుంది. పెట్టుబడి పరిమాణాన్ని ఆధారంగా తీసుకుని ఈవీ, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. శ్రీసిటీలో ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (Tata Advanced Systems Limited) నేతృత్వాన ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తి యూనిట్ను స్థాపించడానికి అవకాశాలను అన్వేషిం చండి. రక్షణ, భద్రతా వ్యవస్థల రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి.
టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ సదుపాయం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి. ఇందు కోసం అవసరమైన భూమిని కోరుకున్న ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ కింద అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్/టెక్నాలజీ రంగాల్లో కోర్సులు రూపొందించడం లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనలో ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. టాటా కెమికల్స్ (Tata Chemicals) నేతృత్వాన మచిలీపట్నం లేదా మూలపేట పోర్టులకు సమీపంలోని ఉప్పు భూముల వద్ద సోడా యాష్ ఉత్పత్తి యూనిట్ స్థాపనకు అవకాశాలను అన్వేషించండి. ఎస్టి టెలీమీడియా (ST Telemedia Global Data Centre) ఆధ్వర్యాన విశాఖపట్నం డేటా సిటీ ప్రాంతంలో AI రెడీ డేటా సెంటర్ క్యాంపస్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.