అమరావతి (చైతన్యరథం): లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ మీడియెట్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమయింది. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల కానున్నట్లు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను తీవంబశ్ర్‌ీంపఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅలో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చునన్నారన. అదనపు సౌలభ్యం కోసం మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కి ‘హాయ్’ సందేశాన్ని పంపడం ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల నిరంతర కృషి నేటి ఫలితాల్లో ప్రతిబింబించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.