- ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో అమలు
అమరావతి(చైతన్యరథం): ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ది పొందవచ్చు. ఉద్యోగులు, వలస కార్మికు లు, విద్యా ర్థుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టబడింది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఏపీ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్సైట్ను సందర్శించవచ్చని ఎన్ఆర్టీ ప్రతినిధులు తెలిపారు.










