- టీడీపీ సభ్యత్వంతో రూ.5లక్షల ప్రమాద బీమా
- ఇన్స్యూరెన్స్ కంపెనీలతో అవగాహన ఎంఓయూ
- పార్టీ తరపున జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతకం
- జనవరి 1నుంచే బీమా వర్తించేలా ఒప్పందం
- ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు బీమా రక్షణ
అమరావతి (చైతన్యరథం): మరికొద్ది రోజుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా ఇన్సూరెన్స్ కంపెనీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం రూ.42కోట్ల రూపాయలు ప్రీమియం మొత్తాన్ని పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమనిధి సారథిóగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138 కోట్లు ఖర్చుచేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేశారు. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. కుటుంబసభ్యుల మాదిరి పార్టీ కేడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.