- సుదీర్ఘ రాజకీయ పయనంలో ప్రజల కోసమే పనిచేశా
- సంస్కరణలకు భయపడితే సంక్షేమాన్ని అందించలేం
- గతాన్ని విస్మరించొద్దు… భవిష్యత్తుపై నిర్లక్ష్యం వద్దు
- అనుక్షణం జూత్త ప్రణాళికలు వేసుకుంటూనే ఉంటా..
- అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. లా అండ్ ఆర్డరే ప్రయారిటీ
- జాతీయస్థాయిలో పాలసీల్లో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణం
- అభిమానులతో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు మనసు మాటలు
- 30 ఏళ్ల అనుభవాలను పంచుకున్న చంద్రబాబు నాయుడు
- తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి
- చంద్రబాబుకు మంత్రులు, నేతలు, అధికారుల అభినందనలు
అమరావతి(చైతన్యరథం): ప్రతినిత్యం కొత్తగా ఆలోచనలు చేయాలనేది తన విధానం… ఇదే తన సక్సెస్ ఫార్ములా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. సోమవారం రాజంపేట పర్యటన ముగించుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబును మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిశారు. సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి కావడంతో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కాసేపు భేటీ అయ్యారు. 30 ఏళ్ల కాలంలో నాలుగు సార్లు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలు… పాలనా అంశాలు, అమ లు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.. ఆ స్ఫూర్తితో భవిష్యత్‌కు ప్రణాళికలు రచించా లి. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలి.. నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి. అధికారులైనా, ప్రజా ప్రతినిధులు అయినా ఒక తపనతో పని చేస్తేనే ఫలితాలు వస్తా యి. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
నా రాజకీయ జీవితంలో అదొక విధానంగా పెట్టుకున్నా. ఇదే నా విజయ రహస్యం. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అనేక సవాళ్లు వచ్చాయి. వాటిని ఎదుర్కోని దృఢ నిర్ణయాలతో పాలన సాగించాం. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చాం. రంగారెడ్డి జిల్లాలో 10 హైస్కూళ్లు కూడా ఉండేవి కాదు. అలాంటి చోట 240 ఇంజ నీరింగ్ కాలేజీలు తెచ్చాం. నాడు రంగారెడ్డి అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉండేది. అలాంటి జిల్లా అనంతర కాలంలో రిచ్చెస్ట్ ప్రాం తంగా మారింది. నాడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూము లు ఇస్తామంటే కంపెనీలు ముందుకు వచ్చేవి కావు. తరువాత వారిని ఒప్పించి మౌళిక సదుపాయాలు కల్పించి సంస్థలను ఏర్పా టు చేశాం. హైటెక్స్, నాక్ వంటి సంస్థలు తెచ్చాం.. నాడు తెచ్చిన హైటెక్స్ దేశంలోనే పెద్ద కన్వెన్షన్ సెంటర్‌గా నిలిచిందని చెప్పారు.
మంచి చేయడానికి ఆలోచన ఎందుకు?
కొన్ని నిర్ణయాలను ఉద్యోగ, కార్మిక సంఘాలు వ్యతిరేకించేవి. ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే భయపడేవాడిని కాదు. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదు. భయపడితే అక్కడే ఆగిపోతాం.. ప్రజలకూ మంచి చేయలేం. సంస్కరణలు అనుకుంటే అమలు చేసేసేవాళ్లం. ప్రజల మంచి కోసం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే.. దేనికీ ఆలోచించే వాళ్లం కాదు. మొదట్లో విమర్శించిన వాళ్లే.. ఆ తర్వాత కాలంలో ఆ నిర్ణయాలు.. ఆ సంస్కరణల్లో విషయముందని మెచ్చుకున్నారు. శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా ఉండేవాడిని. నాడు సీమలో, హైదరాబాద్ సిటీలో మార్పు తెచ్చాం. తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్య తీవ్రంగా ఉండేది. నాయకులు ఊళ్లలో ఉండలేక హైదరాబాద్ వచ్చేసేవాళ్లు. ఎప్పుడో గాని భద్రతతో గాని గ్రామాలకు వెళ్లే వాళ్లు కాదు. అధికారుల్లో నైతిక స్థైర్యం పెంచడానికి స్వయంగా నకల్స్ ప్రాంతానికి వెళ్లే వాడిని. దీంతో అధికారులు సాకులు చెప్పడం తగ్గించి ధైర్యంగా పని చేశారు. రాయలసీమలో విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేది. ఇళ్లలో మహిళలు, పిల్లలపైనా ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఉండేది. హత్యకు హత్య అనే విధంగా నాడు కొందరు ఉండేవాళ్లు. దాన్ని కంట్రోల్ లో పెట్టాం. ఫ్యాక్షన్ అంతం చేశాం. హైదరాబాద్ నగరంలో మత కలహాలు కొనసాగితే పెట్టుబడులు రావని ఆలోచించాం. అందుకే మత ఘర్షణలపై ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా చాలా కఠినం గా ఉన్నాం. సమర్థులైన అధికారులను చార్మినార్ సహా సున్నిత మైన ప్రాంతాల్లో విధుల్లో వేసేవాడిని.. ఫుల్ పవర్స్ ఇచ్చేవాడిని. దీంతో జంట నగరాల్లో మత కలహాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఓట్ల కోసం ఏనాడూ ఆలోచన చేయలేదు
జాతీయ స్థాయిలో మంచి పేరున్న వాళ్లు, ప్రముఖులను తెచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చేవాళ్లం. వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ వంటి వాళ్లను తీసుకువచ్చి ప్రచారం చేయించాం. కార్యక్రమాలు చేప ట్టాం. ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం.. ఇది ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చింది. అనంతపురం జిల్లాలో 10 ఏళ్లలో ఎనిమిదేళ్లు కరవు ఉండేది. రైతులు నష్టపోయే వాళ్లు. దీంతో నాడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పెట్టాం.. తొలిసారి ఈ విధానం తెచ్చింది మనమే. మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలని గొప్ప సంకల్పంతో పనిచేశాం. నాడు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే మహిళా సాధికారతలో అనేక మార్పులు వచ్చా యి. డ్వాక్రా సంఘాలు తెచ్చిన సమయంలో కూడా విమర్శలు చేశారు.. వ్యతిరేకించారు. కానీ వాటి ఫలితాలు చూస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశాం కాబట్టే.. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నాం. విపత్తులు వచ్చి నప్పుడు నేను తీవ్రంగా స్పందిస్తా.. అన్నీ కోల్పోయి తీవ్ర నిస్పృహ లో ఉండే వారికి సాయంగా నిలవాలి.. అదే నిజమైన ప్రజాసేవ. ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా పని చేశాం. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక కార్లు పెట్టి వారిని ఇళ్లకు పంపాను. రాజకీయంగా ఓట్లు రావచ్చు.. రాకపోవచ్చు.. కానీ అలాంటి సమయంలో సేవ చేశా అనే తృప్తి మిగులు తుంది. అంత పెద్ద విపత్తు నుంచి మనం వారిని బయటకు తెచ్చాం.. ఇలాంటివి సంతృప్తినిస్తాయని వివరించారు.
సంకల్ప బలం పుట్టపర్తి సత్యసాయి దగ్గర చూశా
ఒకరోజు పుట్టపర్తి సత్యసాయి బాబా నన్ను పిలిచారు. ఆయన అందరినీ బంగారు అని పిలుస్తాడు.. నన్ను అలాగే పిలిచేవాడు. పుట్టపర్తి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సమస్య గురించి మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నేను ప్రాజెక్టులు చేపడతాను.. ప్రభుత్వం వాటిని నిర్వహణ బాధ్యత చూడాలి అని కోరారు. నేను సరే అన్నాను. వాస్తవంగా అప్పుడు ఆయన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదు. కానీ సంకల్పం ఉంది. భక్తులను స్పందించమని కోరారు.. లేదంటే నా ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టి అయినా తాగునీటి ప్రాజెక్టులు చేపడతానని చెప్పారు. దీంతో పెద్దఎత్తున నిధులు రావడంతో పనులు చేశారు.. ఇదీ సంకల్పానికి ఉన్న గొప్ప తనం.
ఆయన తరువాత కాలంలో మెదక్, మహబూబ్‌నగర్‌లో కూడా తాగునీటి పథకాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్పుడు కుల వృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. ఆదరణ వంటి పథకంతో వారికి ఎంతో చేయూతను ఇచ్చాం. అయితే నేడు కులవృత్తుల్లో మార్పులు వచ్చాయి. వాటికి అనుగుణంగా మనం ఆయా వర్గాల వారికి చేయూతను ఇవ్వాలి. మార్పునకు అనుగుణంగా కుల వృత్తుల్లో, సేవల్లో మార్పులు తేవాలి.. అప్పు డే వారి ఆదాయం పెరుగుతుంది. ఏ విషయమైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు తపనతో పనిచేయండి. అప్పుడు మార్పు తేవడం సాధ్యమే. అధికారులు వినూత్నంగా ఆలోచన చేయాలి.. రోటీన్‌కు భిన్నంగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. జాతీయ స్థాయి పాలసీలో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణమని చెప్పారు.