- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
- సచివాలయంలో అధికారులతో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరా లకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే యస్వామి సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంగళవారం మంత్రి సమావేశమై ఆ శాఖకు సంబంధించి పలు అం శాలపై చర్చించారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలకు సం బంధించిన సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు. గురుకుల విద్య, పీఎంఏజేఏవై నిధులు, ఉచిత డీఎస్సీ కోచింగ్ వంటి అంశాలపై మంత్రి సమీక్షించారు. వీటితో పాటు విజయవాడ నగరంలోని అంబేద్కర్ స్మృతి వనం పైనా ఏపీ ఐఐసీ అధికారులతో చర్చిం చారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ కార్య దర్శి ఎం.ఎం.నాయక్, డిప్యూటీ డైరె క్టర్ లావణ్య వేణి, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.