- పూర్తికాని వెలిగొండకు రిబ్బన్ కత్తిరించి రైతుల్ని మోసగించిన జగన్‌రెడ్డి
- ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్ వెచ్చించిన నిధులెన్ని, పూర్తైన పనులేమిటి
- రైతులకు అందించిన పంటనష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ సాయం ఎంత?
- శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా
- ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి సూటి ప్రశ్న
అమరావతి(చైతన్యరథం): నీళ్లులేని వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి, జాతికి అంకితం చేస్తున్నానంటున్న జగన్‌రెడ్డి మాటలు విని రైతులు నవ్వుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే వెలిగొండను పూర్తిచేస్తానన్న జగన్.. ఐదేళ్ల లో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు, ఒక్క గ్రామానికి తాగునీరు ఇచ్చింది లేదన్నారు. మంగళగిరి లోని పార్టీజాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.1450కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.950కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందన్నారు.తక్కువ నిధులు కేటాయించి, అడు గున మిగిలిపోయిన పనులు పూర్తిచేయించి, మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణం తనవల్లే సాధ్యమైందంటూ రిబ్బన్లు కత్తిరించడానికి జగన్‌రెడ్డికి సిగ్గులేదా అని రామ్ గోపాల్‌రెడ్డి నిలదీశారు.
అనుమతులు తెచ్చుకోలేకపోయాడు
చంద్రబాబు హయాంలో వెలిగొండను ప్రాధాన్య ప్రాజెక్ట్‌గా చేపట్టి, రూ.1450కోట్లు కేటాయించి, పెద్ద ఎత్తున సొరంగాల నిర్మాణం చేపట్టి 90శాతం వరకు పూర్తి చేయించారు. జగన్‌రెడ్డి 5 ఏళ్లలో మిగిలిన 10 శాతం పనిని పూర్తిచేయించలేకపోయాడు. టన్నెల్ వ్యాసార్థాలను కూడా తగ్గించి మ్యాన్యువల్‌గా పూర్తి చేయించాడు. 5ఏళ్లలో ఎన్నోసార్లు ఢల్లీి వెళ్లిన జగన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌కు కేంద్రప్రభుత్వ అనుమతులు పొందడంలో కూడా విఫలమయ్యాడని రామ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.
కుప్పం ప్రజలు పగలబడి నవ్వుకున్నారు
ఇటీవలే కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువను కూడా హడావుడిగా ప్రారంభించిన ముఖ్య మంత్రి, ఫోటోలు తీసుకోవడానికి కాలువలో నీళ్లు నిలబెట్టి, కార్యక్రమం అయిపోగానే అడ్డుపెట్టిన డమ్మీగేట్‌ను కూడా తీయించేశాడు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుప్పం అభివృద్ధికి తానే కారణమన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు, కాలువలోని నీళ్లను సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేయించిన ఆయన పనితనాన్ని చూసి కుప్పం రైతులు పగలబడి నవ్వుకున్నారు. కుప్పం లో జగన్ ఎంతో ఆర్భాటంగా విడుదలచేసిన నీళ్లు సాయంత్రానికే మాయమయ్యాయి. ఇలా ప్రజల్ని ఎంత కాలం మోసగిస్తాడో ముఖ్యమంత్రే చెప్పాలని రామ్ గోపాల్‌రెడ్డి నిలదీశారు.
ప్రజల్ని మోసగిస్తున్నాడు
బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పిం చిన జగన్‌రెడ్డి.. అదే ప్రసంగంలో కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితులకు మొత్తం పునరావాస ప్యాకేజీ చెల్లించినట్టు చెప్పారు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద తాము అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో 10,231 మంది నిర్వాసితులకు రూ.454 కోట్ల పునరావాస సాయం చెల్లించాల్సి ఉందని రాతపూర్వకంగా తెలియచేశారు. ఈ విధంగా జగన్ రెడ్డి బడ్జెట్ ప్రసంగాలతో గవర్నర్‌ను.. ఉత్తుత్తి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలతో ప్రజల్ని మోసగిస్తున్నాడని రామ్ గోపాల్‌రెడ్డి అన్నారు.
రైతువ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం
మిచౌంగ్ తుఫాన్ వల్ల దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, ప్రభుత్వం మాత్రం 6.64 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం జరిగిందని తప్పు డు లెక్కలేసి, 16 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతుల్ని నట్టేట ముంచింది. పంట నష్టం లెక్కలోకి వచ్చిన రైతులకు కూడా కేవలం రూ.442 కోట్ల పరిహారం సొమ్ము మాత్రమే అందించి జగన్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే, కేవలం 102 మండలాల్లో మాత్రమే తీవ్రకరువు ఉందని చెప్పిన జగన్ ప్రభుత్వం, రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని కేవలం రూ.847కోట్లకే పరిమితం చేసింది. జగన్ సొంత జిల్లా కడపలోని 35 మండలాల్లో గత ఖరీఫ్‌లో ఒక్క ఎకరంలో కూడా విత్తనం వేయలేదు. కానీ ప్రభుత్వం వాటిని కరువు మండలాలుగా ప్రకటించలేదు. కడప జిల్లాలో కరువు మండలాలు ప్రకటిస్తే తనకు అవమానమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ రెడ్డి తీరుపై కడప జిల్లా రైతాంగం ఆలోచించాలి.
పంటల బీమా చెల్లింపు విషయంలో జగన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాను అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన పథకం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చిన జగన్ రెడ్డి, వైఎస్సార్ పంటలబీమా పేరుతో తాసుకొచ్చిన పథకంలో రైతుల తరుపున చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ము చెల్లించకుండా అంతిమంగా రైతుల నోట్లో మట్టికొట్టాడు. ఈ క్రాప్ బుకింగ్ పేరుతో వైసీపీ సానుభూతిపరులైన రైతుల పంటల వివరాలు మాత్రమే నమోదు చేయించి అన్నదాతల సాయం విషయంలో కూడా జగన్ రెడ్డి పార్టీల తేడాలు తీసుకొచ్చాడు. జగన్ నిర్వాకంతో పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి అందాల్సిన 25శాతం పంటల బీమా సాయం అందకుండా పోయింది. టీడీపీ హయాంలో రైతులకు ఏ విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ, పంటలబీమా సాయం అందిందో.. 2019 నుంచి ఇప్పటివరకు తన హయాంలో ఎంత సొమ్ము అందిందనే వివరాలు తెలియచేస్తూ ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి. జగన్‌రెడ్డి వెల్లడిరచే వాస్తవాలను బట్టే ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందనే వాస్తవం రైతాంగానికి తెలుస్తుందని రామ్ గోపాల్‌రెడ్డి అన్నారు.
జగన్‌రెడ్డి చేతగానితనంతో..
టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68వేల కోట్లు ఖర్చు పెడితే, జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.22వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అలాంటి వ్యక్తి ప్రాజెక్టులు నిర్మించాన ని, వాటిని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై, కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టినా ఏనాడూ జగన్ రెడ్డి స్పందించింది లేదు. మాట మాత్రంగా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ, కేంద్రానికి గానీ ముఖ్యమంత్రి హోదాలో లేఖలు కూడా రాసింది లేదు. జగన్ రెడ్డి చేతగానితనంతో చివరకు రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారింది. సీమవాసులకు తాగడానికి నీరుకూడా దొరకని దుస్థితి ఏర్పడిరది. సాగునీటి రంగంలో రాష్ట్ర రైతాంగానికి వ్యతిరేకంగా జగన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల ఫలితం రైతులకు శాపంగా మారింది. జగన్ నిర్ణయాల ప్రభావం..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూలంగా మారి, రైతుల ఆగ్రహంతో ఆ పార్టీ రాష్ట్రంలోనే లేకుండా పోతుందని రామ్ గోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
రైతు ఆత్మహత్యల్లో అగ్రస్థానం
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మూడో స్థానంలో నిలిపిన జగన్‌రెడ్డి, తన సొంత నియోజక వర్గం పులివెందులను రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిపాడు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల మరణాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, మరణించిన రైతుల కుటుంబాలకు అందించిన అరకొరసాయం వివరాలే ఈవాస్తవాన్ని బయటపెట్టాయి.
చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ రైతులకు అందించిన నీటి పైపులు, డ్రిప్ పరికరాలు, మైక్రో ఇరిగేషన్ విధానాల వల్ల, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడంవల్లనే ఉద్యాన పంటల సాగులో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది తప్ప, జగన్‌రెడ్డి నిర్ణయాలు, వైసీపీ ప్రభుత్వ పాలనవల్ల కాదని రామ్ గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
పరిహారం అడుగుతారన్న భయంతోనే..
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందించాల్సిన ఆర్థికసాయం ఇవ్వకుండా, వారి గోడు పట్టించు కోకుండా, వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చిన వారిని పోలీసులతో పక్కకు నెట్టించి మరీ జగన్‌రెడ్డి వెలి గొండను ప్రారంభించడం ఆయన ప్రచార ఆర్భాటా నికి నిదర్శనం.వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శనకు రైతుల్ని ఎందుకు అనుమతించలేదో, ముందే పోలీసులతో వారికి నోటీసులు ఎందుకు ఇప్పించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రూ.1500 కోట్ల వరకు రైతు లకు పునరావాస ప్యాకేజీ జగన్ సర్కార్ చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము అడుగుతారనే తన కార్యక్రమానికి ఎవరూ రాకూడదని జగన్ ఆంక్షలు పెట్టాడు. ప్రాజెక్ట్ నిర్మాణమే అసంపూర్తిగా ఉంది.
కాలువలు..వంతెనల నిర్మాణం, రివిట్‌మెంట్ల నిర్మాణం వంటి అనేక పను లు ఎక్కడివక్కడే నిలిచిపోయి ఉంటే, ముఖ్యమంత్రి హడావుడిగా ప్రాజెక్ట్ ప్రారంభించి జాతికి అంకితం చేయడం కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడానికే. జగన్ రెడ్డి తన కామెడీ షోలతో ప్రజల్ని నమ్మించి, ఓట్లు పొందాలనే భ్రమల్లో ఉన్నాడు. వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని రైతాంగం వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెబుతారని రామ్ గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.