- నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు
- వ్యవసాయాన్ని దివాలా తీయించి వారిని నాశనం చేశారు
- వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు
- రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలన్నదే బాబు సంకల్పం
- బడ్జెట్‌లో రూ.43,400 కోట్లు కేటాయించి న్యాయం చేశారు
- విజన్ 2047 డాక్యుమెంట్‌లో ఆ రంగానికి పెద్దపీట
- రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలనేది చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు నేతృతంలో వైసీపీ బృందం నిరసన కార్యక్రమం చేపట్టనుండడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి అండ్ కో వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించి రైతాంగాన్ని అష్టకష్టాలు పెట్టి అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. వ్యవసాయం, రైతుల పట్ల వారి ఆలోచన సరికాదని, రైతులు ఆనందంగా ఉండడం చూసి వారు కడుపు మంటతో కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లూ విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల ను అడుగడుగునా దగా చేసి పూర్తిగా అన్యాయం చేసిన వారు నేడు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తామని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. నిజమైన రైతులెవరూ వైసీపీ నాయకులు పిలవగానే నిరసన కార్యక్రమానికి వెళ్లరు..రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం పేరుతో రైతాంగానికి జరుగుతున్న మేలును ఆపడానికి ప్రయ త్నం చేస్తున్నారు.. రైతులు వైసీపీ నాయకుల మెడలో పాదరక్షల దండలు వేయడం ఖాయమని స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళితే ఇదే సన్మానం జరుగుతుంది. ఐదేళ్లలో రైతులు కోల్పోయిన వాటిని కూటమి ప్రభుత్వం ఇస్తోంది..దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని వివరించారు.
విజన్ డ్యాకుమెంట్‌లో వ్యవసాయానికి పెద్దపీట
రైతును రాజుగా చూడాలనేదే చంద్రబాబు ఆలోచన. విజన్ 2047 డాక్యుమెంట్‌లో వ్యవసాయ రైతాంగానికి పెద్దపీట వేయనున్నారు. రైతాంగం నష్టపోయిన వాటిని పూడ్చే పనిలో నేటి కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని చూడలేక వైసీపీ నాయకులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏ రోజైనా సూక్ష్మపోషకాలపై సమీక్షించారా? నేడు రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి వారు ఈ ఐదేళ్లతో నష్టపో యిన విషయాలను తెలుపుకుంటున్నారు. వైసీపీ హయాంలో భూసార పరీక్షలు లేవు, భూమికి సూక్ష్మ ధాతువులు అందించే పరిస్థితులు లేవు. రైతుల భూములు గుల్లబా రిపోయాయి, తమ భూములు సారం కోల్పోయాయని రైతులు వాపోతున్నారు. వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వంతో రైతులు మొరపెట్టుకుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేష న్, ఎనర్జీ శాఖలు వ్యవసాయ రంగానికి తోడై రైతాంగాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ ఆరు నెలల్లో వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించి కూటమి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిని చాటుకుంది. చినుకుపడితే చాలు చిత్తడే చిత్తడి..ఇది వైసీపీ పాలనలోని పరిస్థితి. వ్యవసాయం, రైతులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధికి ఉంది. ఎక్కడైనా ధాన్యం సేకరణకు ఇబ్బందులుంటే తమ దృష్టికి తెస్తే ధాన్యం ఎత్తిస్తానని చంద్రబాబు స్వయంగా తెలపడం ఆయన దార్శనికతకు నిదర్శనమని తెలిపారు.
రైతుల చేతిలో శృంగభంగం తప్పదు
వైసీపీ నాయకులు రైతులు ఆనందంగా ఉంటే చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో సాలీన వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైసీపీ హయాంలో సేకరించిన ధాన్యమెంతో తెలపాలి. రైతులకు ఎంతమేర సహాయం చేశారో లెక్కలు తెలపాలి. వైసీపీ ప్రభుత్వం ఒక్క పంట కాలువలో కూడా పూడిక తీయ లేదు. ఈ కారణంగా బుడమేరు పొంగి విజయవాడలో అపార నష్టం వాటిల్లింది. నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారు. వర్షం వస్తే వరదలుగా మారే పరిస్థితులు కల్పిం చారు. అందుకే రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వం అంటున్నారు. వైసీపీ నాయకులు కల్లబొల్లి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై బురద జల్లాలని చూస్తే సూర్యుడిపై ఉమ్మాలనుకునేవాడి మీదనే ఉమ్మి పడినట్లవుతుందని హితవుపలికారు. నిరసన తెలియజేయాలని చూస్తే జగన్‌కు, ఆ పార్టీకి చెందిన అరాచక బృందానికి అవమానం కలుగుతుందే తప్ప వారు అనుకున్నది సాధించలేరని స్పష్టం చేశారు. జగన్, ఆయన పార్టీ అరాచక బృందానికి మరోసారి అవమానం తప్పదు.. మరోసారి శృంగభంగమే కలుగుతుందని హితవుపలికారు. కూటమి ప్రభుత్వం రూ. 43,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి రైతులకు న్యాయం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం లోప భూయిష్ట విధానాలతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తే…కూటమి ప్రభుత్వం వ్యవసా యాన్ని, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీని, పశుగణాభివృద్ధిని, కోళ్ల ఫారాలను, వ్యవ సాయాన్ని, వ్యవసాయ అనుబంధరంగాలను ముందుకు తీసుకెళుతుందని తెలిపారు.