- చంద్రబాబు సర్కారు నిధుల విడుదల
- జగన్‌రెడ్డి హయాంలో పిశాచుల స్వైరవిహారం
- అత్యవసర వాహనాలతో అరబిందో వికృత చేష్టలు
- గోల్డెన్ అవర్‌పై నిర్లక్ష్యం… పేదల ప్రాణాలతో చెలగాటం
- శవాలను సైతం వదలని వైసీపీ మాఫియా
అనునిత్యం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల నీరుగారిపోయిన వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే అర్థవుతుంది. గత బడ్జెట్‌తో పోల్చిచూస్తే 23 శాతం అధికంగా 2024-25 బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ. 18,421 కోట్లు కేటాయించడం ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. జగన్‌రెడ్డి ప్రభుత్వం అరకొర కేటాయింపులతో వైద్య రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షే అయింది. కానీ కూటమి ప్రభుత్వం ‘‘అందరికీ ఆరోగ్యం’’ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కోటి 30 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించగా గడిచిన ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో ఉత్తుత్తి హడావుడి చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు కోట్ల బకాయిలు పెట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలు అందించనున్నది. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన 108, 104 సర్వీసులను పేదల చెంతకు మళ్లిస్తోంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సిద్ధం చేయడం శుభపరిణామం.
స్టెమీ కార్యక్రమం అమలులో భాగంగా సమగ్ర కార్యాచరణకు రూపకల్పన జరిగింది. క్యాన్సర్ నివారణకు చేపడుతున్న ఇంటింటి సర్వే, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడానికి బడ్జెట్‌లో అవరమైన నిధులు కేటాయంచడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నిధుల కేటాయింపు ద్వారా నిరూపించుకుంది.
పేదల ప్రాణాలతో జగన్ చెలగాటం
ఐదేళ్ల పాలనలో ముఠా నాయకుడిగా వ్యవహరించిన జగన్ రెడ్డి తన పైశాచిక వ్యాపారంలో పేదల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఆపదలో అక్కరకురాని 108, 104 అత్యవసర వాహనాలు
జగన్ రెడ్డి హయాంలో అంబులెన్స్ వాహనాల నిర్వహణలో మాఫియాలు రాజ్యమేలాయి. పేదలపై జులం ప్రదర్శించాయి. కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలే సిండికేట్‌గా మారి అంబులెన్స్‌లను నడిపినా చూసీ చూడనట్లు వ్యవహరించడం వైసీపీ ప్రభుత్వ పైశాచిక వైఖరిని వెల్లడిస్తోంది. 2019కి ముందు టీడీపీ హయాంలో 108 అంబులెన్సులను సమర్ధవంతంగా నిర్వహించి రోల్ మోడల్‌గా నిలిపారు. 2019లో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 108 అంబులెన్సుల నిర్వహణను అరబిందో కంపెనీకి కట్టబెట్టి వందల కోట్లు అప్పనంగా దోచిపెట్టాడు. . అంబులెన్సుల నిర్వహణకు ప్రభుత్వం చెల్లించే నిర్వహణ ఖర్చులు అమాంతంగా రెట్టింపు చేశారు. 2019 వరకు ఒక్కో 108 అంబులెన్సుకు నెలకు రూ.1.30లక్షలు చెల్లించగా అరబిందో వచ్చిన తర్వాత పాతవాహనానికి రూ. 2.28లక్షలు, కొత్త వాహనానికి రూ.1.78లక్షలకు పెంచేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో అందించాల్సిన సేవలు వ్యాపారమయం చేసి దోపిడీకి తెర తీశారు. నియామకాల పేరుతో లక్షల రూపాయలు సిబ్బంది నుంచి దండుకున్నారు. ప్రమాదాల బారిన పడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి బాధితులు చెల్లించిన బిల్లుల్లో పర్సెంటేజీలు దండుకున్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న సంచార చికిత్స పేరుతో 104 వాహనాలు పల్లె పల్లెకూ వెళ్లేవి. మొబైల్ వాహనాల ద్వారా బీపీ, షుగర్, ఈసీజీ సహా 9 రకాల పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చేవారు. మారుమూల పల్లెల్లో సైతం వైద్య సేవలందించిన 104 వాహనాలు జగన్ రెడ్డి హాయంలో అరకొర సేవలకే పరిమితమయ్యాయి. మండల కేంద్రంలోని ప్రతి గ్రామానికి 104 వాహనం నెలకు రెండు సార్లు వెళ్ళాలి. కానీ వైసీపీ హయాంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యంతో పర్యవేక్షణ లేక నెలకు ఒక్కసారి కూడా వెళ్లని గ్రామాలు ఎన్నో. 108 అంబులెన్సులతో పాటుగా 104 వాహనాలను కూడా అరబిందోకి కట్టబెట్టిన జగన్ రెడ్డి నిర్వహణ ఖర్చు కంటే అదనంగా రూ.175 కోట్లు దోచి పెట్టాడు. ఒక్కో వాహనం నడిపేందుకు డ్రైవర్‌కు 16,000, రోజువారీ ఖర్చులకు 15,000, వైద్యుడికి 60,000, ఇంధనానికి 10,000, మరో 20,000 వరకు ఇతర ఖర్చులు కలిపినా నెలకు 1,20,000 దాటదు. లాభాపేక్షతో సర్వీసులను నడపకూడదన్న స్ఫూర్తికి విరుద్ధంగా అరబిందోపై వల్లమాలిన ప్రేమతో ఒక్కో వాహనానికి నెలకు 1,80,000 చొప్పున బిల్లులు చెల్లించేశాడు. ఇంత దోచేసి సిబ్బందికి మాత్రం జీతాలివ్వకుండా వాళ్ళ పొట్ట కొట్టారు.
గోల్డెన్ అవర్ పాటించని పైశాచిక ముఠా
లక్షల మంది ప్రాణాలు తీసిన అరబిందో
ప్రమాదానికి గురైన బాధితుడు గంట లోపు ఆస్పత్రికి చేరితే ప్రాణాలు రక్షించగలిగే సమయాన్ని గోల్డెన్ అవర్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిగణిస్తుంది. రెండున్నరేళ్ల కాలంలో 67 శాతం కంటే ఎక్కువ కేసుల్లో, 17.80 లక్షల మంది పేషెంట్ల విషయంలో అరబిందో వికృతంగా వ్యవహరించింది. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్పించడంలో నిర్లక్ష్యం చేసిందని కాగ్ నివేదికలో అరబిందోి, జగన్ రెడ్డికి కలిపి లెక్కలతో సహా చెప్పి రెండు చెంపలు వాయించారు. అంబులెన్సుకు నెలకు రూ. లక్ష అదనంగా తీసుకున్నా అరిగిన టైర్లు, విరిగిన బంపర్లు, ఊడిపోయిన డోర్లతో పరిస్థితి దారణంగా మారినా కనీసం వాటికి మరమ్మతులు చేయించలేదు. నిర్వహణ బాధ్యతను గాలికొదిలేసి చివరకు వాహనాలను మూలన పడేశారు. ఒక్కో అంబులెన్సు వాహనం రోజుకు కనీసం 4 కేసులకు వెళ్లాంలి. ఈ లెక్కన 150 వాహనాలను నడపక పోవడం వల్ల ఎంతమంది క్షతగాత్రులకు 108 సేవలు దూరమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. లక్షల మందిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రులకు తరలించడంలో నిర్లక్ష్యం జరిగింది. దీనివల్ల ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసి ఉంటాయో పాపాల భైరవుడు జగన్ రెడ్డికే తెలియాలి. ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపితే జైలుకు పంపి జీవిత ఖైదు విధిస్తారు. కొన్ని కేసుల్లో మరణశిక్షలు కూడా వేస్తారు. అలాంటిది లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన అరబిందో సంస్థ యజమానులు విజయసాయిరెడ్డి వియ్యంకుడు రాంప్రసాద్ రెడ్డి, అల్లుడు రోహిత్, ఈ పాపానికి కర్త, కర్మ అయిన జగన్‌రెడ్డికి ఏ శిక్ష వేయాలి?. కాసుల కక్కుర్తితో ప్రజాధనం దోపిడీ చేసింది కాక అమాయకుల ప్రాణాలు తీసిన వారికి కఠిన శిక్షలు పడాల్సిందే.
అంబులెన్సు మాఫియాకు
చంద్రబాబు చరమగీతం
ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను రాబందుల్లా పీక్కు తిన్న అంబులెన్సుల మాఫియాకు బాబు సర్కారు చరమగీతం పాడుతోంది. జగన్ సర్కారు పక్కన పెట్టిన మహా ప్రస్థానం వాహనాలతో పాటు 58 కొత్త వాహనాలను కూటమి సర్కారు అందుబాటులోకి తెచ్చింది. 104, 108 వాహనాలను ఒకే సర్వీస్ ప్రొవైడర్ కిందకు తెస్తూ రూ. 60 కోట్లతో 190 కొత్త 108 అంబులెన్సులను తీసుకువస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో జీతాలందక నానా తిప్పలు పడ్డ 108 సిబ్బందికి అదనంగా రూ. 4000 పెంచి కొత్త జీతాన్ని కానుకగా ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. 104 వాహనాలలో రక్త పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్‌ని నియమిస్తున్నారు. ప్రతి మండలంలోనూ జన ఔషధి స్టోర్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం,. అనారోగ్యాన్ని ముందస్తుగా గుర్తించడం ద్వారా ప్రీవెంటివ్ హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టారు. కాన్సర్‌తో సహా ఇతర అనారోగ్యాలను గుర్తించి అందుకు తగిన చికిత్స చేసేందుకు ఇంటింటి సర్వే చేపట్టారు. జీవనశైలి వ్యాధుల సర్వే-3 కింద ప్రతి ఇంటికీ ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓలు వెళ్లి వైద్య,ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రశ్నావళి ద్వారా బీపీ, మధుమేహం, కిడ్నీ, టీబీ, కుష్ఠు, కాన్సర్ ఇతర వ్యాధుల వివరాలు సేకరిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 15వేల బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 35 లక్షల మందిని పరీక్షించారు.
విజన్ 2047లో మెరుగైన వైద్యసేవలు
విజన్ 2047 ద్వారా మెరుగైన వైద్యవేవలు అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం భారీ లక్ష్యాలు పెట్టుకుంది. ప్రస్తుతం 70.6 సంవత్సరాలుగా ఉన్న ఆయు ప్రమాణం సగటును 2029 నాటికి 77ఏళ్లు, 2047 నాటికి 85 ఏళ్లకు తీసుకెళ్లాలని భావిస్తోంది. మాత, శిశు, జీవనశైలి, వ్యాధులు, రోడ్డు ప్రమాదాల ద్వారా జరిగే మరణాల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. విశాఖ, గుంటూరు, కర్నూలు నగరాల్లో ప్రాంతీయ పారా మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల దగ్గర్లోని పీహెచ్‌సీల్లో ట్రామా కేసులపై శిక్షణ పొందిన వారిని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2029 నాటికి ప్రాంతీయ, సామాజిక, పీహెచ్‌సీ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ కౌన్సిలర్లను నియమిస్తారు. టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్ అభివృద్ధి, వృద్ధుల (జిరియాట్రిక్ కేర్) ఆరోగ్య సంరక్షణ మెరుగుకు విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఫర్ జిరియాట్రిక్ మెడిసిన్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని సికిల్‌సెల్, రక్తహీనత కేసుల గుర్తింపునకు ప్రత్యేక శిబిరాలు, వైద్య సేవల మెరుగుకు విశాఖలో రాష్ట్ర హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. గర్భిణులు, పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. లైఫ్-స్టైల్ కోచ్‌లుగా సీహెచ్‌ఓలు, జీవనశైలి వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా వైద్య సేవల మరింత మెరుగుపరిచేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ల ఏర్పాటు ఈ విజన్‌లోని ముఖ్యాంశాలు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులతో నేటి నవ్యాంధ్రప్రదేశ్ రేపటి ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌గా మారాలని ఆశిద్దాం.
సౌజన్య బొర్రా
అనలిస్ట్