- చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా?
- సీఎం, డిప్యూటీని కించపరిస్తే సహించేది లేదు
- విలువల గురించి విపక్షం మాట్లాడటం సిగ్గుచేటు
- సీఎంగా పనిచేసిన వ్యక్తి హూందాగా మాట్లాడాలి
- జగన్‌పై విరుచుకుపడిన ఐటీ మంత్రి లోకేష్
- అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి వ్యాఖ్యలు
అమరావతి (చైతన్య రథం): అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్‌రెడ్డిలా ఉంటుందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి బాగా ఫ్రస్టేషన్‌లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నీతులు, విలువలు గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హుందాగా వాస్తవాలు మాట్లాడతారని మేం భావించాం. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా జగన్‌రెడ్డి మాట్లాడారు. జగన్‌రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయనకు విలువలు లేవని, ఏదీ రాదని అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి రారు. ఎప్పడూ దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్ రెడ్డి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
పదవి కోసం తండ్రి శవం దగ్గరే సంతకాల సేకరణ
ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్‌రెడ్డి. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మాపై నిందమోపారు. ఈ రోజు ప్రభుత్వంపైన, బడ్జెట్‌పైన, ఉపముఖ్యమంత్రి పవన్‌పైన మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు పరదాల ప్రభుత్వం పోయింది. బూతులు తిట్టే ఎమ్మెల్యేలూ పోయారు. ఎన్నడూ లేనివిధంగా ప్రజలు కోరుకున్నట్లు, ప్రజలకు అవసరమైన వాటిని బడ్జెట్‌లో పెట్టాం. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అని పదేపదే చెప్పిన వ్యక్తికి ప్రజలు 11 స్థానాలు కట్టబెట్టారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఇప్పటికీ ఆయన తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌రెడ్డి వన్ డే ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు వచ్చి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పి వెళ్లిపోతారు. మళ్లెప్పుడూ కనిపించరు.
డిప్యూటీ సీఎంను జగన్ కించపర్చారు..
జగన్‌రెడ్డికి ప్రజలు ఎందుకు 11 స్థానాలిచ్చారో ఆలోచించాలి. సొంత చెల్లి, తల్లి, కార్యకర్తలే నమ్మడం లేదని ఆయన ఆలోచించుకోవాలి. బ్యాలెట్ ఎన్నికల్లో కూడా 67 శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజశేఖర్‌కు వచ్చాయి. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. అలాంటిది ఇవాళ ఉపముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో జగన్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ ఎంత, పవన్ మెజారిటీ ఎంత? వైసీపీ ఎన్ని సీట్లు వచ్చాయి, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయో జగన్‌రెడ్డి ఆలోచించాలి. నోరుంది కదా అని తాను అనుకున్నదే కరెక్ట్, అధికారంలో ఉన్నవారిని కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేసేలా మాట్లాడతానని అనడం గర్హనీయమని లోకేష్ అన్నారు.
గత ప్రభుత్వం రోడ్లపై గుంతలు పూడ్చలేదు
ఎన్నడూ లేనివిధంగా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. ఎప్పుడూ రానివిధంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. టీసీఎస్, ఆర్సెల్లర్ మిట్టల్, ఎన్టీపీసీ గ్రీన్, రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టులు కానీ.. ఇలా అనేక పెట్టుబడులు వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. ఎన్నడూ లేని సంక్షేమం కూడా చేస్తున్నాం. రూ.200 పెన్షన్‌ను రూ.2వేలు చేశాం. గత ప్రభుత్వం వెయ్యి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే.. మేం మొదటి నెలలోనే వెయ్యి పెంచాం. వికలాంగులకు రూ.6వేల పెన్షన్ అందిస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ.15వేలు కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మూసేసిన అన్న క్యాంటీన్లు 198 ప్రారంభించాం. కోటి గ్యాస్ సిలిండర్లు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. కేవలం లోడిరగ్, రవాణ ఛార్జీలు మాత్రమే తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టల్స్‌లో ఫైన్ రైస్ అమలు చేయబోతున్నాం. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం అమలుచేయనున్నామని లోకేష్ సమాధానమిచ్చారు.
సీఎం, డిప్యూటీ సీఎంను కించపరిస్తే సహించేది లేదు
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల తర్వాత మాపై బాధ్యత పెరిగింది. వన్ మ్యాన్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఈ నెలలోనే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇచ్చిన ప్రతి హామీ పద్ధతి ప్రకారం అమలుచేస్తున్నాం. ఇప్పటికైనా జగన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎందుకు 11 సీట్లు వచ్చాయో బేరీజు వేసుకోవాలి. కార్యకర్తల వద్దకు వెళ్లి తప్పులు తెలుసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గురించి మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ప్రజలు వారిని గెలిపించారు. ఎవరికీ రాని మెజార్టీలతో గెలిచి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడితే మేం సహించబోం. మేంకూడా గట్టిగానే మాట్లాడతాం. మేం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఏదంటే అది మాట్లాడితే వినేది లేదని లోకేష్ హెచ్చరించారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు 12 లక్షలమంది దూరం
అధికారంలో ఉన్నప్పుడు హెలికాఫ్టర్లలో తిరిగిన జగన్‌రెడ్డికి వాస్తవాలు తెలియదు. వైసీపీ హయాంలో 12 లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమయ్యారు. దీనిపై సమాధానం చెప్పాలి. ఐబీ స్కూల్స్ ఎక్కడా ఏర్పాటు చేయలేదు. వారి నుంచి రిపోర్ట్ తీసుకునేందుకు రూ.5 కోట్లు దుర్వినియోగం చేశారు. టోఫెల్ ఎక్కడా సక్రమంగా అమలు చేయలేదు. సీబీఎస్‌ఈ స్కూల్స్ తీసుకురాలేదు. సీబీఎస్‌ఈ పరీక్షల కోసం విద్యార్థులకు మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తే 90శాతం మంది ఫెయిల్ అయ్యారు. దీంతో నేను భయపడ్డాను. మూడేళ్లు వాయిదా వేసి పిల్లలను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వాస్తవాలను జగన్‌రెడ్డి తెలుసుకోవాలి. చర్చ జరగాలంటే శాసనసభకు రావొచ్చు కదా అని హితవు పలికారు.
చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా?
నేడు అసెంబ్లీ పరిసరాల్లో పోలీసుల సంఖ్య తగ్గింది. ఎక్కడా పరదాలు లేవు. ఎవరైనా ప్రశాంతంగా రావొచ్చు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌రెడ్డికి ఉన్న హక్కులు వినియోగించుకోవచ్చు. హౌస్‌కు రావొచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ఆయనకు భయం పట్టుకుంది. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్‌మీట్ పెట్టారు. రెండు రోజుల్లో మళ్లీ బెంగుళూరు వెళ్లిపోతారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారా? జగన్‌రెడ్డికి చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు. అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ రూల్‌బుక్‌లో చాలా స్పష్టంగా 10శాతం సభ్యులు ఉండాలని చెప్తోంది. గతంలో జగన్‌రెడ్డి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పారు కదా. శాసనసభలో వైసీపీకి రోల్ 11 కేటాయించాం. రోల్ 11లో 11మంది కూర్చోవచ్చు. రమ్మనండి, చర్చిద్దాం. ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం వారికి టైం ఇస్తారు. మాట్లాడొచ్చు. ప్రతి సభ్యుడికీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మైక్ ఇస్తున్నారని లోకేష్ స్పష్టం చేశారు.
సొంత పార్టీ కార్యకర్తలనే జగన్‌రెడ్డి కలవడం లేదు
నేను కూడా పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా. ఐదేళ్ల పాలనలో జగన్‌రెడ్డిని దాదాపు 20మంది వైసీపీ ఎమ్మెల్యేలే కలవలేకపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత కార్యకర్తలనే కలవడం లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ పాలనలో 40 లక్షల మందికి ఉద్యోగాలిచ్చింది ఎక్కడ?
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మేం హామీ ఇచ్చాం. ఇప్పటికే 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. తద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. నా స్పీచ్‌లో కూడా మాట్లాడటం జరిగింది. కౌన్సిల్‌లో కూడా చూపించడం జరిగింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలి. చెప్పుకునే స్థాయిలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు. 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే నిరుద్యోగ సమస్య ఎందుకుంటుంది? ఎవరికి, ఎక్కడ కల్పించారో వివరాలు ఇవ్వగలరా? గాలి లెక్కలు చెబితే ఎలా? జగన్‌రెడ్డి పాలనలో కడప స్టీల్ ప్లాంట్ పనులు, పోలవరం పనులు, అమరావతి పనులు ఎందుకు ముందుకెళ్లలేదు? దీనిపై సమాధానం చెప్పాలి. ఎన్నడూ లేనివిధంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాప్‌పైకి ఏపీ వచ్చింది. ఒక్కో కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ వెళ్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు.
వాళ్లు చేసిన తప్పులే మెడకు చుట్టుకుంటున్నాయి
మేం ఎవరిపైన దాడి చేశామో జగన్‌రెడ్డి చెప్పాలి. జగన్‌రెడ్డి ఏపీలో స్వేచ్ఛగానే తిరుగుతున్నారు కదా. ఆయన గేటుకు మేం తాడు కట్టలేదు. ఆయన వాహనాలపై చెప్పులు వేయలేదు. ఆనాడు చంద్రబాబు పల్నాడు ప్రాంతానికి వెళ్తుంటే గేటుకు తాడు కట్టారు. మేం అందరం అమరావతిని సందర్శించేందుకు బస్సులో వెళ్తుంటే బస్సుపైకి వైసీపీ కార్యకర్త చెప్పు విసిరేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అని డీజీపీ చెప్పారు. వారు చేసిన తప్పులే వారికి చుట్టుకుంటున్నాయి. దానికి మేమేం చేస్తాం? చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తోందని లోకేష్ స్పష్టం చేశారు.
జగన్‌కు ఛాన్సిస్తే సీబీఐని, సీఐడీని రద్దు చేస్తారు
వైసీపీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టారు. వారు హౌస్‌కు రావొచ్చు. మేం ప్రతిపక్షాలను ఎందుకు గుర్తించలేదు? చట్టాలను ఉల్లంఘించి ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అనుకోవడం లేదు. రూల్స్‌పై మాకు గౌరవం ఉంది. జగన్‌రెడ్డికి ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ తీసేస్తారు. సీబీఐని రద్దు చేస్తారు, సీఐడీని మూసేస్తారు. ఎందుకంటే ఆయన దందాకు అడ్డువస్తున్నారు కాబట్టి. రూల్ బుక్ ప్రకారం ప్రతిపక్ష హోదాకు 10శాతం సభ్యులుండాలి. ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లే. ప్రజలు నిర్ణయిస్తారు. 40శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి హౌస్‌లోకి వస్తానంటే ఎలా? వ్యవస్థను అందరూ గౌరవించాలి కదా అని లోకేష్ ప్రశ్నించారు.
ఆదాయం లేదని జగన్‌కు ఏ ఆత్మ చెప్పింది?
రాష్ట్రానికి ఆదాయం రావడం లేదని జగన్‌రెడ్డికి ఏ ఆత్మ చెప్పింది. ఆయనకు ఆత్మలతో మాట్లాడటం ఇష్టం. రాత్రికి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయం తీసుకుంటారు. వైసీపీ విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారితప్పిన రాష్ట్రాన్ని మేం తిరిగి గాడిలో పెట్టాం. ఇవాళ ఆదాయం పెరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి సరిచేసుకుంటూ వస్తున్నాం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. కేంద్రం అమరావతికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించింది. ఆ నిధులు మేం ఖర్చుపెడుతున్నాం. దానిపై వడ్డీగాని, టర్మ్ పేమెంట్‌గాని కేంద్రం చేస్తుంది. పోలవరానికి నిధులు మంజూరయ్యాయి. వైసీపీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అదీ మా చిత్తశుద్ధి. కేంద్రం రూ.11వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.2,800 కోట్లు వెచ్చించి విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. అమరావతిపై జగన్‌రెడ్డి విధానమేంటో చెప్పాలి. ఒక రాజధానికి కట్టుబడి ఉన్నారా? లేక మూడు ముక్కలాట ఆడుతున్నారా? అని జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించాలి.
మద్యంలో అవినీతి చేయలేదని సొంత బిడ్డలపై జగన్‌రెడ్డి ప్రమాణం చేయగలరా?
గవర్నర్ స్పీచ్‌పైనా వైసీపీ సభ్యులు దుష్ప్రచారం చేశారు. అవాస్తవాలు చెప్పడం మాకు అలవాటు లేదు. సీపీఎస్‌ను జగన్‌రెడ్డి ఎందుకు రద్దు చేయలేదు? సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎందుకు అమలుచేయలేదు? సొంత బినామీలను పెట్టుకుని అడ్డగోలుగా మద్యంపై డబ్బు సంపాదించారు. మద్యంలో అవినీతి చేయలేదని సొంత బిడ్డలపై జగన్‌రెడ్డి ప్రమాణం చేయగలరా? నేను సవాల్ చేస్తున్నా. పోలవరం విషయంలో ఎత్తు తగ్గిస్తున్నామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. 45.72 మీటర్లకే కట్టుబడి ఉన్నాం. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎగ్గొట్టేందుకు పోలవరం ఎత్తు తగ్గించాలని వైసీపీ ప్రయత్నించిందని మంత్రి లోకేష్ వివరించారు.
మేం ఎక్కడా పరదాలు కట్టుకుని తిరగడం లేదు
మేం ఎక్కడా పరదాలు కట్టుకుని తిరగడం లేదు. జగన్‌రెడ్డి మాదిరిగా 144 సెక్షన్ పెట్టుకుని బతకడం లేదు. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. ప్రజాప్రతినిధులుగాని, సంఘాలుగానీ, ప్రజలు ఎవరైనా మమ్మల్ని కలిసే అవకాశం కల్పిస్తున్నాం. ప్రజాదర్బార్‌లు నిర్వహించి ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నాం. ప్రతిపక్షంలో కూడా జగన్‌రెడ్డి సొంత కార్యకర్తలను కలవకుండా మాకు నీతులు చెబుతున్నారు. గ్రూప్-2 విషయంలో టైం కావాలని అడుగుతున్నారని ప్రభుత్వ బాధ్యతగా లేఖ రాశాం. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగబద్ధ సంస్థ. వారు నిర్ణయం తీసుకున్నారని మంత్రి లోకేష్ వెల్లడిరచారు.