- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితురాలి ఆవేదన
- భూమిని విడిపించి న్యాయం చేయాలని నేతలకు గోడు
- అర్జీలు స్వీకరించిన వర్ల రామయ్య, టీడీపీ నాయకులు
మంగళగిరి(చైతన్యరథం): బతుకుతెరువు కోసం ఉన్న ఊరు విడిచి వెళితే తన 3.37 ఎకరాల భూమిని కబ్జా చేశారని పాత గుంటూరుకు చెందిన ఎన్.లక్ష్మి శుక్రవా రం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. తమ సొంత ఊరు ప్రకాశం జిల్లా కోవిలంపాడులో కబ్జాకు గురైన ఆ భూమి ని విడిపించాలని విన్నవించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, సూరా సుధాకర్‌రెడ్డిలకు వినతిపత్రం ఇచ్చి న్యాయం కోసం అభ్యర్థించారు. అర్జీలు స్వీకరించిన నేతలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` ముస్లిం పిల్లల భవిష్యత్ కోసం గత టీడీపీ ప్రభుత్వంలో బాలికల హాస్టల్ నిర్మా ణం, ఐటీఐ కళాశాల మంజూరు చేసి నిర్మాణం పూర్తి అయినా గత ఐదేళ్లు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముస్లింలపై, టీడీపీపై కక్ష పూరిత ధోరణితో కళాశాలకు అధ్యాపక సిబ్బంది, హాస్టల్ సిబ్బందిని కేటాయించకుండా చేశారని నరస రావుపేటకు చెందిన పలువురు ముస్లింలు ఫిర్యాదు చేశారు.
` వైసీపీ నాయకుడు రాటకొండ సుబ్బరాయుడు తన పొలానికి దారి కోసం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రోద్బలంతో తమపై అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టించారని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం తిమ్మయ్యగారిపల్లెకు చెందిన హరిబాబుతో పాటు పలువురు ఫిర్యాదు చేశారు. దానికి అప్పటి తహసీల్దార్ శిరీష, స్థానిక పోలీసులు సహకరించారని తెలిపారు. తహసీల్దారు వల్ల గతంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని..ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవా లని కోరారు.
` ప్రకాశం జిల్లా దర్శి మండలం బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఉప్పు చిన్న అంజయ్య తన సమస్యను వివరిస్తూ తన భూమిని గత ప్రభుత్వంలో తమకు తెలియ కుండా చింతా హనుమయ్య అనే వ్యక్తి ఆయన పేరు మీద ఆన్‌లైన్‌లో ఎక్కించు కున్నాడని, దాన్ని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
` అధికారులు వైసీపీ నేతలతో కుమ్మక్కై తమ భూమికి దొంగ పత్రాలు సృష్టించి ఇతరుల పేరు మీదకు ఎక్కించారని విచారించి న్యాయం చేయాలని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.సిద్దరాంపురం గ్రామానికి చెందిన వడ్డె గంగన్న వినతిపత్రం అందజేశాడు.
` కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోమటిగుంట గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ లు లేవని, వెంటనే నిర్మించి పల్లె అభివృద్ధికి సహకరించాలని కోమటిగుంట గ్రామస్తు లు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
` రాష్ట్రంలో టైలరింగ్ రంగం దీన స్థితికి చేరుకుంటుందని.. టైలరింగ్ రంగం వృత్తి మీద ఆధారపడిన వారికి సరైన పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ స్వామి వినతి ఇచ్చి అభ్యర్థించారు.
` నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం పరిధిలోని అం కాలమ్మ చెంచుగూడెంలో 26 చెంచు కుటుంబాలకు చెందిన తాము నివాసం ఉంటున్నామని, తమకు ఉపాధి కల్పించి చెంచు గూడెంలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కాలినీవాసులు పలువురు విజ్ఞప్తి చేశారు.
` మాజీ సైనికోద్యోగికి చెందిన పొలాన్ని ప్రభాకర్ అనే వ్యక్తి అధికారులను మేనేజ్ చేసి ఆక్రమించుకున్నాడని, వాస్తవాలను పరిశీలించి మహేష్‌కు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఎన్.అరుణదేవి విన్నవించారు.
` కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఉన్నాయని..గ్రామంలో 10, 15 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేయడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని బి.పెద్దవిరూపాక్షి కోరారు.
` నక్కపల్లి మండలం దేవరం గ్రామంలో సర్వే నెంబర్ 244/1లో ఉన్న 6.44 సెంట్ల ప్రభుత్వ భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని, అలాగే 240/2లో ఉన్న ప్రభుత్వ భూమిని కమ్యూనిటీ హాలు, ఇతర అవసరాలకు కేటాయించాలని ఆ గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.
` గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పించాలని పలువు రు విద్యార్థులు అభ్యర్థించారు. తమ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని మరి కొంతమంది నిరుద్యోగులు అర్జీలు ఇచ్చారు.