- అరబిందో అక్రమాలపై సీబీఐ లేదా సీఐడీ విచారణ జరిపించాలి
- ట్రస్టు పేరుతో సేవ ముసుగులో ఘోరమైన పాపాలు చేశారు
- గోల్డెన్ అవర్ పాటించకుండా లక్షల మంది ప్రాణాలు తీశారు
- అమాయకులను బలితీసుకున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి
- విజయసాయి కుటుంబసభ్యులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం
నెల్లూరు(చైతన్యరథం): గతంలో సత్యం రామలింగరాజు, జీవీకే సంస్థలు 108 సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించి రోల్ మోడల్‌గా నిలిస్తే.. 2019లో 108, 104 అంబులెన్సుల బాధ్యతను జీవీకే నుంచి అరబిందో సంస్థ చేజిక్కించుకుని అక్రమాలకు పాల్పడిరదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అరబిందో రంగంలోకి దిగినప్పటి నుంచి ప్రభుత్వం చెల్లించే నిర్వహణ ఖర్చులను అమాంతంగా రెట్టింపు చేశారు..ట్రస్టు ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో అం దించాల్సిన సేవలను వ్యాపారమయం చేసి దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. 2019 వరకు ఒక్కో 108 అంబులెన్స్‌కు పాతదైనా, కొత్తదైనా నెలకు జీవీకేకి రూ.1.30 లక్షలు చెల్లిస్తుంటే అరబిందో వచ్చిన తర్వాత పాత వాహనానికి రూ.2.28 లక్షలు, కొత్త వాహ నానికి రూ.1.78 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. 104 అంబులెన్స్‌కు నెలకు రూ. 1.80 లక్షలు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. 104 అంబులెన్స్ నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థ రూ.175 కోట్లు అదనంగా వసూలు చేసిం దని అధికారుల విచారణలో తేలిందని తెలిపారు. ఒక్క 104 అంబులెన్సులకు సంబం ధించి రూ.175 కోట్లు దోచేస్తే..ఇక 108 అంబులెన్స్‌ల విషయంలో ఎన్ని కోట్లు తిని ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు.
గోల్డెన్ అవర్ పాటించకుండా లక్షల మంది ప్రాణాలు తీశారు
రెండున్నరేళ్ల కాలంలో 34 లక్షలకు పైగా కేసులకు సంబంధించి 17.80 లక్షల మంది పేషెంట్ల విషయంలో గోల్డెన్ అవర్ పాటించలేదని కాగ్ నివేదిక వెల్లడిరచింది. ప్రమాదానికి గురైన బాధితుడు గంట లోపు ఆస్పత్రికి చేరితే గోల్డెన్ అవర్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిగణిస్తుంది. అంబులెన్సుకు నెలకు రూ.లక్ష అదనంగా తీసుకుంటున్నా 67 శాతం కంటే ఎక్కువ కేసుల్లో గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్పించడంలో నిర్లక్ష్యం చేశారు. 108 సర్వీసులకు 731 అంబులెన్స్‌లు నిర్వహణ సరిగా లేక రోజుకు సుమారు 150 వాహనాలను ఐడిల్‌గా పెట్టి సేవలకు వినియోగించలేదు. ఒక్కో అంబులెన్సు రోజుకు కనీసం 4 కేసులకు అటెండ్ కావాలి. ఈ లెక్కన 150 వాహనాలను నడపక పోవడం వల్ల ఎంతమందికి 108 సేవలు దూరమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపితే పాత ఐపీసీ సెక్షన్ 302 చట్టం ప్రకారం జైలుకు పంపి జీవిత ఖైదు విధిస్తారు..కొన్ని కేసుల్లో మరణశిక్షలు విధిస్తారు. దర్యాప్తు సంస్థల నివేదికలను పరిశీలించిన తర్వాత 2.5 ఏళ్ల కాలంలో సుమారు 34 లక్షల కేసులకు సంబంధించి 17.80 లక్షల మందిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రులకు తరలించలేకపోయారని తేలి పోయింది.
ఆ 17.80 లక్షల మందిలో ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉంటాయో తలుచుకుంటేనే బాధకలుగుతుంది. ట్రస్టు పేరుతో 104, 108 అంబులెన్స్ బాధ్యతలను అరబిందో చేపట్టి సుమారు రూ.400 కోట్లు వరకు దోచేయడంతో పాటు ఎందరో అమా యకుల ప్రాణాలు బలితీసుకుంది. విజయసాయిరెడ్డి వియ్యంకుడు రాంప్రసాద్‌రెడ్డి, అల్లుడు రోహిత్ ఆధ్వర్యంలోని అరబిందో సంస్థ చేసిన పాపాలకు ఏ శిక్ష వేయాలి. కాసుల కక్కుర్తితో ప్రజాధనం దోపిడీ చేసింది కాక అమాయకుల ప్రాణాలు తీసిన వారికి కఠిన శిక్షలు పడాలి. ఒక ప్రాణం పోతేనే జీవితఖైదు, మరణశిక్షలు విధిస్తే వేలాది మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన వారికి ఏ శిక్షలు విధించాలి. పేదల ప్రాణాలు ప్రాణాలు కావా? వేల కోట్లు దోచుకునే అరబిందో కంపెనీ ప్రతినిధుల ప్రాణాలకు ప్రత్యే కత ఉందా? పేదల ప్రాణాలను నిర్లక్ష్యం చేసే వారికి గుణపాఠం చెప్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. రూ.25 వేలు లంచం తీసుకున్న తహసీల్దార్‌ను క్షణాల్లో అరెస్టు చేస్తున్నా రు..ఈ లెక్కన వందల కోట్లు దోచేసిన వారి విషయంలో ఎలా స్పందించి ఉండాలి? విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు కాబట్టి ప్రత్యేక చట్టాలుంటాయా? ప్రభుత్వం, అధికా రులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలి..మోసపోయిన వారిని రక్షించాలి. ఇది ఆషామాషీ కేసు కాదు..సీబీఐ లేదా సీఐడీ ద్వారా సమగ్ర విచారణ జరపాలని స్పష్టం చేశారు.