- కూటమి హామీల అమలుకు నిధుల కొరత ఉండదు
- రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంపు, సంపద సృష్టి ద్వారా భారీ అదనపు ఆదాయం
- కేంద్ర పథకాల పూర్తి సద్వినియోగంతో వేలాది కోట్ల ప్రయోజనం
- జగన్ బృందం దోపిడి నివారణతో అదనపు నిధులు
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత ఐదేళ్లుగా చేసిన దుబారా ఖర్చును అరికడితే పేదలకు కూటమి ఇచ్చిన అదనపు సంక్షేమ హామీలు అమలు చేయవచ్చన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉండికూడా ఇటీవల విడుదలైన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో తాను ఇక అదనపు సంక్షేమ భారాన్ని మోయలేనని జగన్‌రెడ్డి చేతులెత్తేసిన వైనాన్ని వారు తప్పుబడుతున్నారు.
మంగళవారం కూటమి మేనిఫెస్టో విడుదలైన నేపథ్యంలో.. కూటమి ప్రకటించిన పలు అదనపు సంక్షేమ హామీలు, అభివృద్ధి ప్రతిపాదనలకు అవసరమైన నిధుల సమీకరణ మార్గాలపై చైతన్యరథం పలువురు నిపుణుల అభిప్రాయాలు సేకరించింది.
రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు, రేపటి ఆకాంక్షలను నెరవేర్చాలనే సంకల్పంతో సుదీర్ఘమైన కసరత్తు చేసిన తరువాత కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించిందని, వాట్సాప్ ద్వారా లక్షా ముప్పై వేలమంది నుంచి సేకరించిన సూచనలు, అభిప్రాయాలు, యువగళం, జనవాణిల ద్వారా వివిధ వర్గాల ప్రజలనుంచి అందిన డిమాండ్లు, సూచనల ఆధారంగా కూటమి ప్రజా మేనిఫెస్టో తయారైందని తెదేపా నాయకులు వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ, చేసిన ప్రతిపాదనలకు సంబంధించి లోతైన పరిశీలన జరిగిన తరువాతనే వాటిని మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందని అంటున్నారు. ఈవిధంగా కూటమి మేనిఫెస్టోలోని ప్రతి సంక్షేమ హామీ అమలుకు సంబంధించి లెక్కలు వేయటం జరిగిందని స్పష్టం చేశారు. ఈకోణంలో.. కూటమి సంక్షేమ హామీల అమలుకు అవసరమైన నిధుల లభ్యత గురించి ఎటువంటి సందేహాలకూ తావులేదన్నది వారి నిశ్చితాభిప్రాయం.
కూటమి మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ హామీలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల సమీకరణ, మార్గాలను నిపుణులు వివరించారు.
ప్రభుత్వ దుబారా ఖర్చు నిర్మూలించటం, దోపిడీని అరికట్టటం, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవటం, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచటం, సంపద సృష్టి ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని కల్పించటం ద్వారా అదనపు సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన నిధులు సేకరించుకోవచ్చని వారి అభిప్రాయం.
సంపద సృష్టి అనేది ఒక కళ. అది బాగా తెలిసిన నాయకుడు, గతంలో చేసి చూపిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన తిరిగి అధికారంలోకి వస్తే ఆర్థిక వనరుల సమీకరణకు మంచి ఊతం లభిస్తుంది. తద్వారా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా చేపట్టవచ్చని ఆర్థిక నేతలు తెలిపారు. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసత్యాల కట్టుకథలను వారు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటంలోను, రెవెన్యూ లోటు నియంత్రించి రుణ భారాన్ని అదుపులో ఉంచటంలోను, పెట్టుబడులను ప్రోత్సహించటంలోను 2014-19 కాలంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు, గత ఐదేళ్ల జగన్‌రెడ్డి ప్రభుత్వ తీరుకంటే ఎంతో మెరుగ్గా ఉందని వారు వివరించారు.
2014-15లో నవ్యాంధ్ర వార్షిక ఆదాయం రూ.65,595 కోట్లు ఉండగా, తెలంగాణ ప్రభుత్వ ఆదాయం రూ.51,042 కోట్లు ఉందని, వార్షిక ఆదాయంలో పైచేయిగా ఉన్న రాష్ట్ర వైఖరి కొనసాగి 2018-19 నాటికి రాష్ట్ర ఆదాయం దాదాపు రూ.50 వేల కోట్లు పెరిగి రూ.1,11,000 కోట్లకు చేరగా, తెలంగాణ ఆదాయం దాదాపు రూ.10 కోట్లకు తక్కువగా రూ.1,02,000 కోట్లుగా ఉన్నది. ఇందుకు భిన్నంగా జగన్ హయాంలో ఐదేళ్ల తరువాత రాష్ట్ర వార్షిక ఆదాయం కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే పెరిగి రూ.1,19,000 కోట్లకు చేరితే… తెలంగాణ ప్రభుత్వ ఆదాయం రూ. 1,25,000 కోట్లకు పెరిగింది. ఇది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమని, జగన్ హయాంలో అభివృద్ధి కనుమరుగవటం, ప్రభుత్వ అవినీతి, సహజ వనరుల దోపిడి ఇందుకు కారణాలన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అద్దంపట్టే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) సగటు వార్షిక ఎదుగుదల చంద్రబాబు హయాంలో 13.50 శాతం ఉండగా, అది జగన్ పాలనలో 9 శాతానికి పడిపోయిందని నిపుణులు చెప్పారు. సగటు వార్షిక రెవెన్యూ లోటు చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రూ.13,664 కోట్లు ఉంటే.. అది జగన్ పాలనలో భారీగా పెరిగి రూ.35,000 కోట్లకు ఎగబాకిందన్నారు. చంద్రబాబు పాలనలో గరిష్ట వార్షిక రెవెన్యూ లోటు రూ.33,445 కోట్లు ఉండగా, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దానిని రూ.77,000 కోట్లకు పెంచారన్నారు. రెవెన్యూ లోను నియంత్రించి ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 1,98,977 కోట్లు మాత్రమే అప్పు (ఆర్బీఐ నుండి) అప్పు చేయగా, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఆర్థిక నిర్వహణలో తన ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిరచుకున్నాడని తెలిపారు. చంద్రబాబు హయాంలో భారీగా వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో దేశంలో 4వ స్థానంలో రాష్ట్రం ఉండగా.. జగన్‌రెడ్డి నిర్వాకంతో రాష్ట్రం 17వ స్థానానికి దిగజారిందని కుటుంబరావు తెలిపారు.
నిధుల సమీకరణ మార్గాలు:
ప్రభుత్వ దుబారా ఖర్చు తగ్గించటం
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాఠశాల భవనాలకు భారీ ప్రజాధనం దుర్వినియోగంతో పార్టీ రంగులు వేయించటం, తిరిగి వాటిని తొలగించటం, భారీ సంఖ్యలో పనీ పాటా లేని సలహాదారుల నియామకం, వారిపై భారీగా ఖర్చులు చేయటం, మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌లో తిరగటంవంటి పలు దుబారా ఖర్చులు చేశారని, కేవలం ఇటువంటి దుబారాను అరికట్టడం ద్వారా ఏడాదికి దాదాపు రూ.24 వేల కోట్ల ప్రభుత్వ నిధులు మిగులుతాయని, వీటిని వినియోగించుకొని కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన అదనపు సంక్షేమ హామీలను అమలుపరచవచ్చని నిపుణులు వివరించారు.
దోపిడీని అరికట్టడం…
గత ఐదేళ్లుగా రాష్ట్రలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రంగాలలో జగన్ బృందం భారీ దోపిడి చేసిందని, దీని కారణంగా ప్రభుత్వానికి చేకూరవలసిన ఆదాయం రాలేదని, ఈ దోపిడిని అరికడితే ప్రభుత్వ ఆదాయం పెరిగి సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వనరులు తగు మేరకు చేకూరతాయని నిపుణుల అభిప్రాయం.
కేంద్ర పథకాల సద్వినియోగం
జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పలు కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ నిధులు ఇవ్వకపోవటంతో రూ.40 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులను రాష్ట్రం కోల్పోయిందని.. ఇందుకు భిన్నంగా వ్యవహరించి కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో కేంద్ర నిధుల ద్వారా వివిధ పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాలకు ఊతమియ్యవచ్చు.
సంపద సృష్టి ద్వారా అదనపు ఆదాయం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడిన అనంతపురం జిల్లాకు కియా ఫ్యాక్టరీని తీసుకురావడం ద్వారా సంవత్సరానికి వేలాది కోట్ల జీఎస్టీ ఆదాయం వస్తోందని, రూ.1600 కోట్ల ఖర్చుతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించటంతో డెల్టా ప్రాంతంలో సంవత్సరానికి రూ.20,000 కోట్ల అదనపు వ్యవసాయ ఉత్పత్తి జరిగిందని.. ఇలా సంపద సృష్టి ద్వారా ఆదాయం పెంచుకోవటానికి ఇవి ఉదాహరణలని వారు తెలిపారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంపు
గత ఐదేళ్ల జగన్ పాలనలో పలు ఆర్థిక రంగాలు విధ్వంసానికి గురై ఆర్థికాభివృద్ధికి గండిపడిరదని, అట్టి రంగాల పునర్నిర్మాణం ద్వారా ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని కుటుంబరావు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తే పన్నులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయ చేకూరుతుందని, చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయితే ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుందని అన్నారు. 2014-19 కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల సగటున సంవత్సరానికి 13.50 శాతం ఉందని.. దీన్ని 15 శాతానికి పెంచగలిగితే ప్రభుత్వ ఆదాయం వివిధ మార్గాల్లో పెరిగి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన అదనపు నిధులు లభిస్తాయి.
కూటమి హామీలతో బెంబేలెత్తిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వాటి అమలుపై కేవలం రాజకీయ కారణాలతో విమర్శలు చేస్తున్నారని నిపుణుల అభిప్రాయం.
ఎందుకు?
గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో అన్ని వ్యవస్థలు చతికిలబడ్డాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుచూపుమేరలో కనపడవు. వ్యవసాయ రంగం కుదేలైంది. రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిలకడలేని విధానాలతో కీలకమైన విద్యారంగం గందరగోళంలో పడిరది. ప్రభుత్వ బకాయిలు భారీగా పేరుకు పోవడంతో వైద్య రంగం చతికిలబడి సగటు జీవి విలవిలలాడుతున్నాడు. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్నవి రాష్ట్రం వదలి పారిపోవడంతో పారిశ్రామికరంగం అస్తవ్యస్తమైంది. ప్రభుత్వ మోసపు వైఖరితో సంక్షేమం తీవ్ర సంక్షోభంలో పడిరది. అసమర్థ ఆర్థిక నిర్వహణతో ఆర్థిక వ్యవస్థ అప్పులమయమై చిన్నాభిన్నమైంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం ‘జీ హుజూర్’ అంటూ న్యాయాన్ని, చట్టాలను మంటగలిపింది. న్యాయ వ్యవస్థ కూడా అధికారగణం వికృత చేష్టల బారినపడిరది. వెరసి.. సగటు జీవి అన్నివిధాలా బలయ్యాడు.
ఈ రాక్షస క్రీడ నుంచి ప్రజలకు ఊరట లభించాలంటే జగనాసుర వధ జరగాలి. దీనికి ముహూర్తం మే 13. ప్రజలు ఆలోచించాలి. చేయి చేయి కలిపి కదం తొక్కాలి. గుర్తుంచుకోండి.
ఇక మిగిలింది 11 రోజులే