- నిబంధనల ప్రకారం ధాన్యానికి డబ్బు చెల్లింపు
- సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
మచిలీపట్నం(చైతన్యరథం): రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడా లేని విధం గా 24 గంటల్లో నగదు చెల్లిస్తుందని సమాచార పౌర సంబంధా లు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరు లో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే తాను శనివారం కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశామ న్నారు. నీలిమీడియా విషయాన్ని పక్కదారి పట్టించడంతో తాను పరుషంగా మాట్లాడవలసి వచ్చిందని తెలిపారు. గత ప్రభు త్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అణా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండిరచిన పంటకు ధర చెల్లించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. దాదాపు 20 వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లింపు కోసం ముందు గానే సిద్ధం చేసుకున్నామని తెలిపారు. కొన్న ప్రతి బస్తాకు 24 గంటల్లో అవసరమైతే 4 నుంచి 5 గంటల్లో కూడా చెల్లింపు చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. తాను పేదరికం నుంచి వచ్చానని తనకు రైతుల బాధలు తెలుసన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితు ల్లోనూ నష్టం జరగకూడదన్నది తమ అభిమతమని తెలిపారు. రైతులకు మిల్లర్లు, బ్రోకర్లు ఎవరు అన్యాయం చేసినా కఠిన చర్య లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ అధికా రులు పనితీరు, ప్రవర్తన పట్ల ప్రజల అభిప్రాయాలను పైనుంచి ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. తాను గట్టిగా మాట్లాడి రైతుకు రూ.1450 నుంచి రూ.1650 ఇప్పించడం తప్పు కాదన్నారు. ఈ చర్యల వల్ల మిల్లర్లు, అధికారులు ఎవరూ రైతుకు అన్యాయం చేయాలంటే వెనుకంజ వేస్తారని తెలిపారు.















