- మా కుటుంబానికి మీరే కొండంత అండ
- ప్రతిపక్షంలోనూ కనిపెట్టుకునే ఉన్నారు.
- స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారింది
- 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- వైసీపీ వై నాట్ 175 అంటే.. ప్రజలు వై నాట్ 11 అన్నారు
- ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్
- తెలుగువారికి ఏ కష్టమొచ్చినా.. ఏపీ ఎన్నార్టీ ముందుంటుంది
- డలాస్ తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్ భావోద్వేగం
డలాస్ (చైతన్య రథం): ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలమిచ్చారని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమెరికా డలాస్లోని కర్టిస్ కల్ వెల్ సెంటర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ముందుగా శ్రీ హరిహరపీఠం వేదపండితులు మంత్రి లోకేష్కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ…. “సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు.
నేను అమెరికాలో నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. రెండేళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మరో రెండేళ్లు స్టాన్ ఫోర్డ్లో ఎంబీయే చేశాను. ఈ దేశంలో సుమారు తొమ్మిదేళ్లున్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్ పోర్ట్నుంచి బయటకు వస్తుండగా ఆరుగురు పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అన్నారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డలాస్లో అడుగుపెట్టిన దగ్గరనుంచి ఈరోజు కార్యక్రమం వరకు నాకు భారీ ఘనస్వాగతం పలికిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అన్నారు.
ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం
“అమెరికాలో ఉన్నానా? ఆంధ్రలో ఉన్నానా? అనే అనుమానం వచ్చింది. మీ ఉత్సావం, జోష్ చూస్తుంటే. నా యువగళం పాదయాత్ర రోజులు గుర్తుకువస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. నడవనివ్వలేదు. మైక్ -లాక్కున్నారు. స్టూల్ లాక్కున్నారు. అయినా మనవాళ్ల తొడగొట్టి, తగ్గేదేలేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో.. అదేవిధంగా ఈరోజు నాకు అంత -ఘనస్వాగతం పలికారు. ఇక్కడ చాలామంది నాకు ప్రతిపక్షం రోజులనుంచీ పరిచయం ఉన్నవారున్నారు.. -వారిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తుకువస్తున్నాయి. -మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత లోకేస్ తీసుకుంటాడు. చంద్రబాబుని 53 రోజులుపాటు -అక్రమంగా నిర్బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు -అండగా నిలిచారు. డల్లాస్ లో ఏకంగా మూడు కార్యక్రమాలు నిర్వహించారు. మా కుటుంబానికి మీరు కొండంత బలమిచ్చారు. ఈ రాజకీయాలు -మనకు అవసరమా? అని ఆనాడు బ్రాహ్మణి అడిగారు. అమెరికాలో, హైదరాబాద్లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమాని సుమారు 45 వేలమంది వచ్చి మాకు అండగా -నిలబడ్డారు. ధైర్యమిచ్చారు. ఈ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవడం వల్లే” అని లోకేష్ ఉద్ఘాటించారు.
ఈ మీటింగ్ చూశాక.. టీమ్ 11కి నిద్ర పట్టదు
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనల్ని మదరాసీలు అనేవారు. మదరాసీలు కాదు.. తెలుగువాళ్లం ఉన్నామని దేశానికి చాటిచెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్. అభివృద్ధి చేసి ఎన్నికల్లో గెలవవచ్చని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే.. కంప్యూటర్లు అన్నం పెడతాయా? అని ఆనాటి ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేశారు. ఇప్పుడు మిమ్మల్నందరినీ అడుగుతున్నా… కంప్యూటర్ అన్నం పెడుతోందా? అని. హైదరాబాద్కు పెద్దఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువస్తే విమర్శించారు. ఇప్పుడు మీరొక్కసారి హైటెక్ సిటీకి వెళితే.. గుర్తుపట్టలేని పరిస్థితి” అని లోకేష్ వివరించారు.
చంద్రబాబు దార్శనిక నాయకుడు
చంద్రబాబు ఐటీని పరిచయం చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకు హైదరాబాద్ పోటీ ఇస్తోంది. చంద్రబాబు వయసు 75 ఏళ్లు. 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారు. ఆయన స్పీడ్ను ఇంకా అందుకోలేక -పోతున్నా ఏదోకరోజు ఆయన స్పీడ్కు దరిదాపుల్లోకి వస్తానని భావిస్తున్నా గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం -టెక్నాలజీ. ఆయన ముందుచూపున్న నాయకుడు. తెలుగుజాతికే అది ఒక అదృష్టం. ఏ దేశానికి వెళ్లినా. -ఏ కంపెనీకి వెళ్లినా సాదర స్వాగతం పలుకుతున్నా రంటే కారణం.. మన నాయకుడు చంద్రబాబు -నాయుడు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగ కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన పార్టీ -తెలుగుదేశం పార్టీ. నాయకులు శాశ్వతం కాదు.. కార్యకర్తలే టీడీపీకి బలం. అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండా చూసినా మనకు ఎక్కడలేని ఎమోషన్” అని -భావోద్వేగంగా ప్రకటించారు.
వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అన్నారు
“కార్యకర్తల త్యాగాలను మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. మెడపై కత్తిపెట్టినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి, రక్తం కారుతున్నా చివరి ఓటు వేసే వరకు బూత్లో అండగా నిలబడిన మంజులరెడ్డికే మీ లోకేష్ అండ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. జై తెలుగుదేశం అని అన్నందుకు విజయవాడలో గాంధీ కంటిచూపు పోగొట్టుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో మీకు తెలుసు. ఇంటినుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేశారు. వై నాట్ 175 అన్నారు.. ప్రజలే వై నాట్ 11 అని సమాధానమిచ్చారు. చంద్రబాబు, పవనన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు. అందుకు ప్రజలే వారితో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధం సిద్ధం అని బయలుదేరారు. ప్రజలు ఏకంగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు” అంటూ లోకేష్ వైసీపీ వైఖరిని ఎండగట్టారు.
ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్
“అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు. కానీ మీరు ఎంఆర్ఐలు. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంవైపు, మీ ఊరివైపు ఉంటుంది. ఊరి ప్రజలకు అండగా నిలవాలని ఎప్పుడూ ఆలోచిస్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పెద్దఎత్తున బయటకు వచ్చి అండగా నిలిచారు. సొంత రాష్ట్రంపై ప్రేమ ఉంది కాబట్టే.. ఎన్నికలకు ఆరు నెలలు, ఏడాది ముందు వచ్చి మీరు ఏ పదవీ, డబ్బు ఆశించకుండా మాకు అండగా నిలిచారు. అందుకే ఎప్పుడూ లేనివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. 175 సీట్లకుగాను 164 సీట్లు గెలిచి రికార్డు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డ్లు తిరగరాస్తాం. 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా మీరు మమ్మల్ని గెలిపించారు. అందుకే కూటమి సూపర్ హిట్. వైసీపీ 11 ఫర్ ఆలౌట్”.
స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్
“దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లున్నాయి. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు నాయకత్వం, మరోవైపు నాకు అన్నసమానమైన పవనన్న నాయకత్వంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్, 2019 నుంచి 2024 వరకు మేం ఏపీ నుంచి వచ్చామని చెప్పుకునేందుకు సిగ్గుపడే వాళ్లం. ఈరోజు అన్ని రంగాల్లో ఏపీ స్పీడ్గా ముందుకెళ్తంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ హబ్ గా చేశాం. కర్నూలులో పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువస్తున్నాం. చిత్తూరు, కడపకు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నెల్లూరు జిల్లాకు డైవర్సిఫైడ్ మాన్యుఫ్యాక్చరింగ్, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. ప్రకాశంను సీబీజీ హబ్ తయారు చేస్తున్నాం. కృష్ణా, గుంటూరులో రాజధానితోపాటు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకువస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం.రిఫైనరీలు, అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఐటీ, ఫార్మా మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్తోపాటు ఆర్సెల్ల మిత్తల్ స్టీల్ ప్లాంటు కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి లక్ష్యం
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి లక్ష్యం. యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు గంగా ధర నెల్లూరులో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశాను. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లల కు ఉద్యోగాలు కల్పిస్తేచాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజే నిర్ణయించుకున్నా మేం తిరగని దేశాలు లేవు. గత 17నెలల్లో రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు. తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది” అని లోకేష్ వివరించారు.
విడాకులు.. మిస్ ఫైర్లు.. క్రాస్ ఫైర్లుండవు
“ప్రభుత్వ కొనసాగింపు చాలాఅవసరం. గుజరాత్. ఒడిశాలో ఒకే ప్రభుత్వం సుదీర్ఘంగా ఉండటంవల్ల అభివృద్ధి సాధ్యమైంది. రాష్ట్రంలో ఐదు కాదు.. పది కాదు.. పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం. కలిసికట్టుగా పనిచేస్తామని పవ నన్న పదేపదే చెబుతున్నారు. ఆంధ్రులందరూ గర్వపడే విధంగా ముందుకు వెళ్తాం. విడాకులు ఉండవు. మిస్ ఫైర్లు ఉండవు. క్రాసెఫైర్లు ఉండవు. ఎన్డీయే కూటమి రాబోయే పదేళ్లు రాష్ట్రాన్ని ముందు-కు తీసుకెళ్తుంది. కలలకు రెక్కలు పేరుతో వచ్చే ఏడాది నుంచి విదేశాల్లో చదువుకునే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఏపీ ఎన్ఆర్టీ మీకు అండగా నిలుబడుతోంది. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది” అని లోకేష్ హామీ ఇచ్చారు.
జాబ్ క్రియేటర్స్ తయారు కావాలి
ఇక్కడున్న అందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు.చదువుకుని మంచి ఉద్యోగాల కోసం ఇంత -దూరం వచ్చాం. ఒక్కో కుటుంబానికి దేవుడు. ఒక్కో పరీక్ష పెడతాడు. 2019లో నేను మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయాను. కాస్ -అధైర్యపడలేదు. కసితో పనిచేసి 91 వేల -మెజార్టీతో విజయం సాధించాను. చిన్న ఎదురుదెబ్బ తగిలిందని బాధపడటం, ఆత్మ -హత్యలకు పాల్పడటం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. -అద్భుతంగా పెంచారు. వారి గురించి ఆలో చించాలి. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్స్ మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ మనం తయారుకావాల్సి న అవసరముంది. రతన్ టాటా ఇన్నోవేషన్ -హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. అమెరికాలో మనకు ఇంత గౌరవం దక్కుతుందంటే.. దానికి కారణం మనకంటే ముందు వచ్చినవారు. 1960 నుంచి పెద్దఎత్తున తెలుగువారు అమెరికాకు వచ్చారు. అద్భుతంగా రాణించారు. మన గౌరవాన్ని పెంచారు.ఇప్పుడు ఆబాధ్యత మన భుజ స్కంధాలపై ఉంది. ఆ గౌరవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఒకరికొకరు అండగా నిలవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం” అని మంత్రి లోకేష్ ఉద్భోధించారు.చట్టాన్ని ఉల్లంఘించిన
వారిని వదిలిపెట్టేది లేదు
“రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు.మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు. నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను. మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. నా తల్లి బాధ, ఆవేదనను చూసిన వాడిని. మా అమ్మ ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. వారి నాన్న ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి. కానీ ఒక్క పోస్టింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఏనాడూ ఇన్వాల్వ్ కాలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వారు అవమానించారని మనం అవమానించ కూడదు. స్త్రీలను గౌరవించడం మన పార్టీ మనకు నేర్పిన ధర్మం” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహా రాల సలహాదారు, ఏపీ ఎన్నార్టీ సొసైటీ అధ్యక్షులు వేమూరు రవికుమార్, ఎస్ఆర టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం, టెక్సాస్లోని గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్, డల్లాస్ టీడీపీ నాయకు లతోపాటు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.














