- కర్నూలు చిరు వ్యాపారికి లోకేష్ హామీ
- ఎక్స్‌లో పోస్టుతో వ్యాపారి వలీకి ధైర్యం
అమరావతి (చైతన్య రథం): కుటుంబాన్ని పోషించేందుకు కోవా బన్ అమ్ముకుంటున్న సాధారణ చిరు వ్యాపారి వలీని కొందరు పనిగట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న సమాచారంపై ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కొందరి అత్యుత్సాహంవల్ల చిరు వ్యాపారి కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందన్న సమాచారంపై భావోద్వేగంతో ఎక్స్‌లో పోస్టు పెట్టారు. “కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారిని త్వరలో కలుస్తా” అని బాధితుడికి భరోసానిచ్చారు. ఆదివారం ‘ఎక్స’లో పోస్ట్ పెడుతూ “వలీ తయారు చేసే కోవా బన్ రుచి చూసేందుకు ఆసక్తితో ఉన్నా. అతనిపై కొందరు ఆరోపణలు చేయడం కలచివేసింది. అలాంటి చర్యలు నిజంగా దుర్మార్గం. ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదు. వలీకి అండగా ఉంటాం” అని లోకేశ్ తన పోస్టులో ధైర్యం చెప్పారు.















