చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పాలన ఎవరిదో…విధ్వంసం ఎవరిదో జగన్‌రెడ్డితో చర్చకు నేను సిద్ధం

సీఎం వైఎస్‌ జగన్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్‌

by చైతన్యరధం
February 19, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభివృద్ధి పాలన ఎవరిదో…విధ్వంసం ఎవరిదో  జగన్‌రెడ్డితో చర్చకు నేను సిద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బూటకపు ప్రసంగాలు కాదు… దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్‌ సిద్ధమా?
  • ఎవరి పాలన స్వర్ణయుగమో… ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం
  • జగన్‌ సిద్ధం అని సభలు పెట్టి… అశుద్ధం మాటలు చెపుతున్నాడు
  • 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్‌కు రాజకీయంగా చివరి ఛాన్స్‌
  • వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు
  • ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్‌ మడతపెట్టాడు
  • మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు
  • రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్‌ సంక్షేమం గురించి చెప్పడమా?
  • రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి కాదు… ఐదేళ్ల పాలనా విధ్వంసమే కనిపిస్తోంది
  • సీఎం వైఎస్‌ జగన్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్‌

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంస పాలనపై సీఎం జగన్‌తో చర్చకు తాను సిద్ధం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ… అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతూ జగన్‌ చెబుతున్న అసత్యాల నిగ్గుతేల్చేందుకు తాను సిద్ధం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు…దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్‌ సిద్ధమా? ఏ అంశం మీదైనా.. ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే అని చంద్రబాబు అన్నారు. ఎవరి పాలన స్వర్ణ యుగమో… ఎవరి పాలన రాతియుగమో చర్చిద్ధాం..చర్చకు వచ్చే దమ్ముందా జగన్‌ అంటూ సవాల్‌ చేశారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్సే జగన్‌ కు చివరి ఛాన్స్‌ కానుందన్నారు. ఓటమిపై జగన్‌ కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కొంచెం పక్కకు జరిపి ఎన్నికల ముందు రోడ్డెక్కాడని చంద్రబాబు దుయ్యబట్టారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్‌ సంక్షేమం గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్‌కు… పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్‌ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్ది కాదు… ఏ ఊరుకెళ్లినా జగన్‌ 5ఏళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సిద్ధం అని సభలు పెడుతూ జగన్‌ నోటి వెంట అశుద్ధ పలుకులు పలికాడని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

ఓటమి భయంతో 77మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్‌ ఇప్పటికే మడతపెట్టాడని… మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి…సామాజిక ద్రోహం చేసిన జగన్‌కు.. సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదన్నారు. జగన్‌ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైసీపీని ఓడిరచేందుకు స్టార్‌ క్యాంపెయినర్‌ కాబోతోందని చంద్రబాబు అన్నారు.
`రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయా ణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ,స్కూల్‌ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు. సభ నిజంగా సక్సెస్‌ అయ్యి ఉంటే జగన్‌రెడ్డి రౌడీ గ్యాంగ్‌ వార్తలు కవర్‌చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్టే షన్‌తో దాడులు ఎందుకు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్‌కు 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం అని అన్నారు. టీడీపీ తెచ్చిన 120సంక్షేమ పథకాలు రద్దుచేసిన జగన్‌ ప్రభు త్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నార న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్‌పై పేదలు యుద్ధా నికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
` తెలుగుదేశం పేరు, నా పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్‌ప్లాన్‌ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 11 డీఎస్సీలతో ఇచ్చిన 1.50లక్షల టీచర్‌ పోస్టు లు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అమరావతి, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు గుర్తు కు వస్తాయి అని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళల కోసం 22 పథకాలు తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు.
` జగన్‌రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి శీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్‌ ప్రో కో, ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ మాఫియా గుర్తొస్తాయ న్నారు. జగన్‌ పేరు చెపితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తొస్తాయని చంద్రబాబు దుయ్యబట్టారు.
` మ్యానిఫెస్టోలో మద్య నిషేధం అని చెప్పి… తరువాత దాన్ని మద్య నియంత్రణ అని మార్చి.. రూ.1.50లక్షల కోట్ల మద్యం అమ్మిన జగన్‌ విశ్వసనీ యత గురించి చెపితే జనం నమ్మాలా అని ప్రశ్నిచారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98శాతం అమలు చేశాం అని జగన్‌ చెపుతున్న మాటలు పూర్తిగా బూట కం… ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపడం నిజం అని చంద్రబాబు స్పష్టం చేశారు. నిన్నటి వరకు పరదాల్లో తిరిగిన జగన్‌… 9సార్లు కరెంట్‌ చార్జీలు పెంచిన జగన్‌…పేదల గురించి ఎన్నికల సమయంలో మాయ మాటలు చెపుతున్నాడని ఎద్దేవా చేశారు.
` రైతు భరోసాలో జగన్‌ ఇచ్చింది రూ.37వేలు మాత్రమే. రైతు రుణమాఫీ ద్వారా ఒకే సారి మేం రూ.50వేలు ఇచ్చింది వాస్తవం కాదా… ఎన్నికల సమ యంతో మిగిలిన మొత్తం అందకుండా నాడు జగన్‌ కుట్రలు చేసింది నిజం కాదా అని చంద్రబాబు ప్రశ్నిం చారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను రివర్స్‌ చేసి, రైతుల సబ్సిడీలు నిలిపివేసిన జగన్‌కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదన్నారు.
` విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక అడ్డంకులు, సవాళ్ళు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళితే… జగన్‌ తన విధ్వంస పాలనతో విభజన కంటే ఎక్కువ నష్టం చేశా రని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో 14 శాతం ఉండే వృద్ధిరేటు… ఈ ప్రభుత్వం వచ్చాక 10.93 శాతానికి పడిపోయిందని, వైసీపీ ప్రభుత్వ హయంలో వృద్ధి రేటు 4.06 శాతం తగ్గింది, టాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదాయానికి గండి పడిరదన్నారు. విభజన జరిగిన ప్పుడు మనకంటే తెలంగాణ 35శాతం అధికంగా తలసరి ఆదాయం ఉంటే… 2014 తర్వాత ఏపీలో సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించామని వివరించారు. ఇప్పుడు జగన్‌ నిర్వాకం వల్ల ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే 44 శాతం తక్కువగా ఉందని, అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు అన్నారు.
` రాష్ట్రంలో అక్రమ కేసులు, అధికార దుర్వి నియోగం తప్పజగన్‌ సాధించింది శూన్యం అని చంద్ర బాబు అన్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన ప్రతి పక్షాలకు సమాధానం చెప్పలేకే కేసులతో వేధిస్తున్నార న్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై తాజాగా కేసు పెట్టడాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండిచారు. జగన్‌ కేసులు పెట్టినా…. దాడులు చేసినా ప్రశ్నించే గళాలను అణిచివేయలేడని… ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నా రని… తమ జీవితాలు నాశనం చేసిన ఫ్యాన్‌ రెక్కలు విరగొట్టడానికి జనంతో కసితో ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.

Previous Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – భీమిలి నియోజకవర్గం

Next Post

జగన్‌ పాలనలో పరిశ్రమలు పరార్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

November 6, 2026
ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు
ఆంధ్రప్రదేశ్

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

November 6, 2026
కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం
ఆంధ్రప్రదేశ్

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

November 6, 2026
‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం
ఆంధ్రప్రదేశ్

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

November 6, 2026
‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు
ఆంధ్రప్రదేశ్

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

November 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

November 5, 2026
Next Post
జగన్‌ పాలనలో పరిశ్రమలు పరార్‌

జగన్‌ పాలనలో పరిశ్రమలు పరార్‌

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

by కార్యకర్త
November 6, 2026

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

by చైతన్యరధం
November 6, 2026

విధ్వంసం, అసత్య ప్రచారం వైసీపీ నైజం ఓటు వేయని జగన్కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు...

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

by చైతన్యరధం
November 6, 2026

అమరావతి (చైతన్యరథం): జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక...

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

by చైతన్యరధం
November 6, 2026

ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా 67.24 శాతం పోలింగ్ నమోదు స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.