- ఇప్పటికీ 70,238 మంది నుంచి దరఖాస్తులు
- జగనన్న ఇళ్ల పథకంలో అవకతవకలు నిగ్గు తేలుస్తాం
- మండలిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్లు ఉండాలనేది టీడీపీ విధానమని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత నెలలో ఇందుకు సంబంధించి జీవో ఇవ్వగా ఇప్పటివరకు 70,238 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారులెంద రో లెక్క తేలిన తర్వాత ప్రభుత్వ భూములు ఉన్న చోట కేటాయిస్తామని చెప్పారు. ప్రభు త్వ భూములు లేకుంటే ప్రైవేట్ భూములు సేకరించి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. సోమవారం శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతురావు తదితరు లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం 30 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిందని చెప్పగా దాన్ని మంత్రి అనగాని ఖండిరచారు. 22 లక్షల పట్టాలు మాత్రమే ఇవ్వగా అందులో ఏడు లక్షల మంది ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవ డానికి ముందుకు రాలేదని..వారంతా ఎవరని ప్రశ్నించారు. వీరు నిజంగా అర్హులైతే రిజి స్ట్రేషన్ చేయించుకోవడానికి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా మా ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇవ్వ నుందని చెప్పారు. అంతేకాక ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయాన్ని అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం రూ.2.5 లక్షలు మాత్రమే అది కూడా కేంద్ర ప్రభు త్వం నిధులనే ఇచ్చారని చెప్పారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారింది.. లబ్ధిదారుల ఎంపికలో పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు.. ధనవంతులు, ఉద్యోగు లు, పార్టీ కార్యకర్తలు, అనుయాయులకు ఇళ్ల పట్టాలు పంచి పెట్టారు.
ఇళ్ల పట్టాల కోసం భూముల కోనుగోలులో పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు..నివాస యోగ్యం కాని భూములను, శశ్మానాలు, డంపింగ్ యార్డులు పక్కనున్న భూములను, వర్షం వస్తే మునిగిపోయే భూములను రెండిరతలు, మూడిరతలు అధిక ధరలకు ప్రభుత్వంతో కొని పించారని తెలిపారు. మొత్తం రూ.10,500 కోట్లతో 26 వేల ఎకరాల ప్రైవేట్ భూముల ను కొనుగోలు చేస్తే ఇందులో వేల కోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. జగనన్న ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలు నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే అందరికీ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద వాడికి ఇంటి పట్టా ఇచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసు కుంటుందని స్పష్టం చేశారు.