సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి
హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశం
అమరావతి(చైతన్యరథం): బంగాళాఖాతంలో అల్పపీడనం నేప థ్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైం ది. హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయ లక్ష్మి, డైరెక్టర్ ప్రఖర్‌జైన్, కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అల్పపీడన ప్రభావంతో గురువా రం కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల్లో కం ట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి లోని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిం చారు. వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేం దుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశిం చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పడిన చెట్లను వెంటనే తొలగించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,19,133 క్యూసెక్కులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అనిత సూచించారు. ప్రమాద ప్రాంతాల్లో తప్పనిసరిగా హెచ్చరిక బోర్డులతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని తెలిపారు. ప్రజలు హోర్డింగ్స్, శిథిలా వస్థలో ఉన్న భవనాలు, గోడలు, చెట్ల వద్ద ఉండరాదని సూచిం చారు. సోషల్ మీడియాల్లోని వదంతులు నమ్మరాదని..అప్ర మత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడనంతో కోస్తాంధ్రపై ప్రభావం
పశ్చిమ మధ్య, వాయువ్య బంగా ళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడి రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకా శం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 2,77,688 క్యూసెక్కులుగా ఉంది..వరద ప్రవాహం మొదటి హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉంది..నదీ పరీవాహక, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.