అమరావతి (చైతన్యరథం): గుడ్ ఫ్రైడే సందర్భంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇదే రోజు శిలువ ఎక్కారన్నారు. తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలనూ, దోషాలనూ ప్రక్షాళన చేశారు. క్షమ, శాంతితో కూడిన సందేశాన్ని తన త్యాగంతో యేసుక్రీస్తు చాటిచెప్పిన పవిత్రమైన రోజే గుడ్ ఫ్రైడే అన్నారు.