- వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆసుపత్రుల్లోనే ఉండాలి
- ముందస్తు జాగ్రత్తలపై మంత్రి సత్యకుమార్ దిశానిర్దేశం
- ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో శాఖాపరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కార్యదర్శి సౌరభ్ గౌర్, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా టెలికా న్ఫరెన్స్ ద్వారా శనివారం మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ… వాతావర ణ కేంద్రం నుంచి అందే హెచ్చరికలు, సంకేతాలను పరిగణనలోకి తీసుకునేలా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల మధ్య సమ స్వయం ఉండాలని స్పష్టంచేశారు. గతానుభవాల్ని పరిగణలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో మరిన్ని ముందస్తు చర్యలు అవసరమని సూచిం చారు. ఈ క్రమంలో ఏ స్థాయిలోనూ అల క్ష్యం, నిర్లక్ష్యం కనిపించకూడదని హితవు పలికారు. తుపాను ప్రభావ పరిస్థితులు కుదుటపడేవరకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వారు పనిచేసే ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎపిడిమిక్ సెల్స్ ఏర్పాటు లు
క్ష్యం, నిర్లక్ష్యం కనిపించకూడదని హితవు పలికారు. తుపాను ప్రభావ పరిస్థితులు కుదుటపడేవరకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వారు పనిచేసే ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎపిడిమిక్ సెల్స్ ఏర్పాటు ఈ సందర్భంగా కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఎపిడిమిక్ సెల్స్ను ఏర్పాటు చేశామని చెప్పారు. పాము కాటు విరుగుడు మందు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందు బాటులో ఉంచామని చెప్పారు. అలాగే ప్రసవ తేదీకి దగ్గర్లో ఉన్న గర్భిణుల వివరా అందుబాటులో ఉన్నాయని, వీరి విషయంలో ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకుంటు న్నామని తెలిపారు. తుపాను నేపథ్యంలో అంటువ్యాధుల నియంత్రణా చర్యల్లో భాగంగా ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీంలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అవరోధం తలెత్తితే వైద్య సేవలు కొనసాగించే విధంగా జనరేటర్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను, సీని యర్ వైద్యుల్ని అప్రమత్తం చేశామన్నారు. 108 అంబులెన్సులు, ఫీడర్ అంబులెన్స్ల ను అత్యవసర సమయంలో ఉపయోగిం చేలా మ్యాపింగ్ చేశామని వివరించారు.










