అనంతపురం (చైతన్యరథం): సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడిరచారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాధవ్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లిన విజయవాడ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.