- మంత్రి అనం రామనారాయణరెడ్డి నివాళి
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ధంతి
మంగళగిరి(చైతన్యరథం): పరిటాల రవీంద్ర తుదిశ్వాస వరకూ పేద ప్రజల కోసం పోరాడిన ధీరుడు పరిటాల రవి అని మంత్రి అనం రామనారాయణరెడ్డి కొనియాడారు. ఆయన ఆస్తమించి రెండు దశాబ్ధాలైనా నేటికీ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని ప్రశంసించారు. పరిటాల రవీ 20వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీని సమర్థవంతంగా నడిపించి అటు ప్రజలకు, ఇటు టీడీపీ శ్రేణులకు అండగా నిలబడి చిరస్థాయిగా నిలి చిపోయారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా, ముఖ్యుడిగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. పరిటాల కుటుంబం పార్టీకి అంకితమై ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనాయకుడు నారా లోకేశ్‌తో కలిసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నారన్నారు. పరిటాల మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ అశోక్‌బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, సీనియర్ నాయకులు ఎ.వి.రమణ, రాష్ట్ర మీడియా కోఆర్టినేటర్ దారపనేని నరేంద్ర, బొద్దులూరి వెంకటేశ్వరరావు, పర్చూ రి కృష్ణ, హసన్‌బాషా, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.