చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హరిత యజ్ఞం..మన సంకల్పం

వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Aug 31, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హరిత యజ్ఞం..మన సంకల్పం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
  • 50 శాతం పచ్చదనం వస్తేనే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్‌
  • మొక్క లేకపోతే మానవ మనుగడే లేదు
  • చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు
  • 175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటు
  • నీటి వనరులు, సహజ వనరులను పరిరక్షిస్తాం
  • ప్రకృతి ప్రజల ఆస్తి, కాపాడుకోవాలి
  • ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలైనా నాటాలి
  • అడవిలో కాలు పెడితే ఎర్రచందనం స్మగ్లర్ల సంగతి తేలుస్తాం
  • వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి(చైతన్యరథం): ‘‘హరితాంద్ర కోసం అడుగేద్దాం.. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం’’ అన్న సమున్నత లక్ష్యంతో భవిష్యత్‌లో రాష్ట్రంలో 50 శాతం విస్తీర్ణం మేర పచ్చదనం పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. వనమహోత్సవం-2024 సందర్భంగా శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్‌ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమహోత్సవంలో పాల్గొన్న చిన్నారుల చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయించారు. చిన్నారుల భవిష్యత్తే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఈ నేపథ్యంలోనే వన మహోత్సవ ప్రతిజ్ఞ చిన్నారుల చేత చేయించామని ముఖ్యమంత్రి అన్నారు. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.. ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో సింగారిద్దామని ప్రతిజ్ఞ చేశారు.

ఇక నుంచి ఎక్కువ మొక్కలు నాటిన వారిని గుర్తించి అలాంటి వారికి ఆగస్టు 15, జనవరి 26 న అవార్డులు అందించి ప్రోత్సహిస్తామని సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు పర్యావరణంపై మక్కువ ఎక్కువన్నారు. అందుకనే పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగతంగా చెట్లు నాటాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. నేడు రాష్ట్రం మొత్తం బాధ్యత తీసుకున్నాడు. అందరం ఆక్సిజన్‌ తీసుకుంటాం, కానీ ఆక్సిజన్‌ ఇచ్చే చెట్టును మాత్రం పెంచాలని ఆలోచించటం లేదన్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి లేదా రెండు చెట్లు నాటితే దాదాపు 10కోట్ల చెట్లు అవుతాయని తెలిపారు. ఈ ఏడాది లక్ష్యం ఒక కోటి చెట్లు నాటడమని, ఇది ఒక ఉద్యమంలా తీసుకోవాలని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 7-11-2025

చైతన్యరధం ఈ పేపర్ 6-11-2025

దుబాయ్ లో ముగిసిన మంత్రి నారాయణ పర్యటన

తాను 30,40 సంవత్సరాల నుండి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మొక్కల పెంపకం కార్యక్రమానికి పెద్దపీట వేశానని గుర్తుచేశారు. తన మనస్సుకు దగ్గరుండే కార్యక్రమం వన మహోత్సవం అన్నారు. ఒకప్పుడు పాఠశాలల్లో గార్డెనింగ్‌ ఉండేది. కానీ నేడు అసలు గార్డెనింగ్‌ అన్నదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లి దగ్గరలోని బావుల్లోని నీరు తెచ్చి మొక్కలకు పోసేవాళ్లమని తెలిపారు. ఈ సందర్భంగా మీరు ఎంత మంది మొక్కలకు నీళ్లు పోస్తున్నారని చిన్నారులను నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వస్తే అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్‌ అని ఉద్ఘాటించారు. ఒకప్పుడు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం ప్రారంభించాము. అప్పట్లో అదోక విప్లవం. ఆ తరువాత ఇంకుడు గుంతలను ప్రోత్సహించాం. అప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. పడే ప్రతి వర్షపు చినుకును భూగర్భజలాలుగా మార్చాలి. భూమినే జలాశయంలా మార్చినప్పుడు ఇబ్బందులనేవి ఉండవన్నారు. గతంలో అడవులు చుట్టూ కందకాలు తవ్వించాము.

అక్కడ పడిన వర్షపు నీరు కందకాల్లోకి చేరుతుంది. కందకాల మధ్యలో చెక్‌ డ్యాంలు కట్టించాం. దీంతో నీరు ఎక్కడికక్కడ నిలిచి భూగర్భంలోకి వెళ్లి చుట్టూ పక్కల భూగర్భజలాలు పెరుగుతాయి. అంతటి మంచి కార్యక్రమాలు నాడు చేశామని గుర్తుచేశారు. మంగళగిరి ఎకో పార్క్‌, ఎయిమ్స్‌, బెటాలియన్‌ ఇవన్నీ అమరావతి రాజధాని నడిబొడ్డున ఉండటం గర్వకారణమన్నారు. ఎకో పార్కును చూస్తుంటే ఎటు చూసినా పచ్చదనం అలుముకుని సుందరంగా, కళ్లకు ఇంపుగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది. మనస్సు ఆహ్లాదంగా ఉందన్నారు. ప్రతి రోజూ ఉదయం పార్క్‌ లో 300 మంది వాకింగ్‌ చేస్తున్నారు. వారి సంఖ్య 3వేలు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.
చెట్లతోనే మనుగడ
అమరావతి ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో హైదరాబాద్‌లో అన్నీ గుట్టలు, కొండలు.. అలాంటి సమయంలో చెట్లు పెంచాం, రోజుకు లక్ష నుంచి 5 లక్షల వరకు మొక్కలు నాటాం. దీంతో నేడు ప్రపంచంలోనే హైదరాబాద్‌ గ్రీన్‌ సిటీగా గుర్తింపు పొందిందని వివరించారు. 2014లో మిషన్‌ హరితాంధ్రప్రదేశ్‌ కు శ్రీకారం చుట్టాం. అప్పుడు 50 శాతం పచ్చదనం రావాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం రావాలంటే 26 జిల్లాల్లోనూ మొక్కలు పెంచే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి. అందుకనే డ్రోన్‌ల ద్వారా విత్తనాల బంతులను చల్లి మొక్కలు పెరిగేలా కృషి చేస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు పెంచే కార్యక్రమానికి మనందరం శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నగర వనాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

అక్కడ జపనీస్‌ టెక్నాలజీతో మియావకీ అనే కార్యక్రమం ద్వారా ఒక హెక్టార్‌లో మొక్కలు నాటి ఆదర్శంగా తీర్చిదిద్ది, ఆసక్తి ఉన్న వాళ్ల ద్వారా ఉద్యమంలా ముందుకు తీసుకువెళతామన్నారు. నరేగా నిధులను మియావాకి కి కలపడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఉప ముఖ్యమంత్రి సూచన చాలా బాగుందని ప్రశంసించారు. నేడు నదులు, వాతావరణం ఒకటేమిటి అన్ని విధాల కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క అడవులను నరికి వేస్తున్నాం. మరికొంత మంది కాలువలను, చెరువులను కబ్జా చేస్తున్నారు. పట్టణాలు పెరిగిపోతుండటంతో మొత్తం కాంక్రీట్‌ మయమైపోతోంది. దీంతో పర్యావరణ పరంగా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. దీనివలన కరువు, కాటకాలు, భారీ తుఫాన్‌లు వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల క్లౌడ్‌ బరస్ట్‌ జరుగుతోంది. అంటే ఒకే ప్రాంతంలో కుండపోత వర్షం కురవడం. ఇదే కేరళలో కూడా జరిగింది. ఇవన్నీ తప్పించుకోవాలంటే మొక్కలు నాటడమే పరిష్కారమని సీఎం చంద్రబాబు సూచించారు.

పర్యావరణ సమతుల్యత ముఖ్యం
అమరావతిని సుందర రాజధానిగా తీర్చిదిద్దుతాం. బ్లూ అండ్‌ గ్రీన్‌ కాన్సెప్ట్‌ తో ముందుకు వెళుతున్నాము. రాజధాని ప్రాంతంలో 51 శాతం చెట్లు ఉంటాయి. పార్క్‌ లు ఉంటాయి. గత ప్రభుత్వం మాత్రం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తులను ప్రోత్సహించి వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు కూడా ఇచ్చింది. ఇక సహజ వనరుల దోపిడి చూస్తే రూ.19వేల కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక సంగతికి వస్తే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. నీళ్లు, గాలి, సకాలంలో వర్షాలు, భూగర్భంలో సహజ వనరులు ప్రకృతి ఇస్తే వాటిని కూడా దోచుకుని చివరకు కొండలను సైతం తవ్విపడేశారు. విశాఖలో రుషికొండను తవ్వి రూ. 500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నారు. నాటి పాలకుల ఆలోచన విధానం అలా ఉంది. గత పాలకులు ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ చెట్లు మొత్తం కొట్టేయించేవారు. కానీ మేము మొక్కలు నాటుతాం కానీ చెట్లను నరకం. ఎవరినీ నరకనీయం. ఇది మా సిద్దాంతం. బ్రహ్మంగారు కాలజ్ఞనం రాసిన రవ్వలకొండను సైతం గత పాలకులు తవ్విపడేశారు.

అంతటి దుర్మార్గమైన పాలన చేశారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు. కొలంబియాలో ప్లాబ్లో ఎస్కోబార్‌ అనే నాయకుడు డ్రగ్స్‌ వ్యాపారం చేసి వందలు వేల కోట్లు సంపాదించి, ఆ సొమ్ముతో రౌడీయిజం చేసి, ప్రజలను భయబ్రాంతులను చేసిన విషయం గుర్తుకువస్తోంది. గత పాలకుడు.. ఎస్కోబార్‌ లాగే ఉన్నాడు. స్వేచ్ఛగా బతకలేని పరిస్థతి రాష్ట్రంలో సృష్టించారు. రౌడీ పాలన దెబ్బకు ప్రజలు భయపడిపోయేవారు. ఇప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది. అలాంటి వారు మళ్లీ వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుంది. భవిష్యత్‌ అంధకారమవుతుంది. వ్యవస్థలు ఎంతలా నాశనం అయిపోయాయంటే బాంబేకు చెందిన సినీనటి కాదంబరిని.. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా చేపడతాం. నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత మాదే, అలాగే పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడ్డాయి.

జలశయాలన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఇదే భవిష్యత్తు మార్పుకు శుభసూచకం. ఒకప్పుడు విద్యుత్‌ ఎక్కడో ఉత్పత్తి జరిగేది, కాని నేడు మీ స్కూల్‌ లోనే, మీ ఇంట్లోనే, మీ పొలంలోనే సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకోవచ్చు. మా తరంలో స్కూల్‌ కైనా, ఎక్కడికైనా నడిచివెళ్లేవాళ్లం. మీ తరం అదృష్టవంతులు ఎక్కడికి వెళ్లాలన్నా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్‌లో మరిన్ని మార్పులు వస్తాయి. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీ అన్నింటి ద్వారా పొల్యూషన్‌ లేని గ్రీన్‌ కరెంట్‌ ను ఉత్పత్తి చేస్తాం. దీంతో మీకు ఉపాధి, ఉద్యోగ కల్పన జరుగుతుంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఖనిజ సంపదను ఎవ్వరిని దోచుకోనివ్వం, ఇసుకను ఉచితంగా ఇస్తాం. జీవవైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేశమంటే అడవులు, జంతువులు, పక్షులు, జల వనరులు అన్ని కలిస్తేనే సమతుల్యత ఉంటుంది. గాలి లేకపోతే మానవ మనుగడే లేదు. చెట్లు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు. ఈ రెండూ కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. మన భవిష్యత్‌ కోసం పర్యావరణ సమతుల్యత కోసం పాటుపడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రకృతిని కాపాడుకోవాలి
జీవవైవిధ్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్‌ పార్క్‌లు, 2 జూలాజికల్‌ పార్క్‌ లు, ఒక టైగర్‌ పార్క్‌, ఎలిఫెంట్‌ శాంక్చ్యురీ.. ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌-శ్రీశైలం మధ్యలో 5300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్‌ శాంక్చ్యురీ వస్తుంది. అడవులను ఎవరైనా విధ్వంసం చేస్తే వదిలిపెట్టం, ఇకపై ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు సాగవు. అవసరమైతే డ్రోన్‌ పర్యవేక్షణతో వారి ఆగడాలను అరికడతాం. అడవికి హాని తలపెట్టేందుకు ఎవరైనా అడుగుపెడితే అదే వారికి చివరి రోజు అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు కావాలంటే మొక్కలు పెంచాలి. ప్రకృతి ప్రజల ఆస్తి దానిని అందరం కాపాడుకోవాలన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలను సిద్ధం చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 నగర వనాలను పెంచుతాం. 2047 కి ఏపీ నెంబర్‌ వన్‌ స్టేట్‌ గా ఉండాలి. చిన్నారుల భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుంది. సాధారణ కుటుంబాలకు చెందిన చిన్నారులు సైతం పెద్ద స్థాయిలో ఉండాలంటే సంకల్పం కావాలి, సంకల్పం చేసుకుని, అనుకున్న లక్ష్యం కోసం పాటుపడండి.

మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం. పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం. పెట్టుబడులు తెస్తాం. యువతకు భరోసా ఇస్తాం. సంపద కొందరి వద్దే ఉండటం కాదు.. పేదరికం లేని సమాజం తీసుకురావడానికి కృషి చేస్తాం. ఇలా చేయాలంటే నాలెడ్జి ప్రాముఖ్యతను గుర్తించాలి. నాలెడ్జి ఎకానమితో అద్భుతాలు సృష్టించవచ్చు. మా ఆలోచన హరితాంధ్రప్రదేశ్‌.. మా ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్‌. చిన్నారులందరూ మొక్కలు నాటుతామని, వాటిని సంరక్షిస్తామని సంకల్పం చేసుకోవాలి. చిన్నారులు మీరు నాటిన మొక్కకు మీ అమ్మ పేరు పెట్టండి, కన్నతల్లి మనకు జన్మనిచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోడానికి ఒక మొక్క నాటుతాం అని నిర్ణయం తీసుకోవాలి. గత పాలకుడు పట్టాదారు పుస్తకాలపై తన ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు అలా ఉండదు. రాష్ట్ర భవిష్యత్తు మీ యువత చేతుల్లో ఉంది. మీకు సహకారం అందించే బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు ప్రసంగం ముగించారు. కార్యక్రమం చివరల్లో వ్యాఖ్యాత ఏకే సుజాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ను కృష్ణార్జునులతో పోల్చడంతో సరదాగా నవ్వుకున్నారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది..

చీకటి నుంచి వెలుగువైపు: పెమ్మసాని
కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మనం ఒక విత్తనం నాటినప్పుడు విత్తనం భూమిలో చీకటిలో ఉంటుంది. అన్నింటినీ చీల్చుకుని బయటకు వస్తుంది. ఇది మన జీవితానికి ఒక పోలిక. చెట్టు సూర్యుడి వైపు ఎదుగుతుంది. అంటే ప్రగతి వైపు, కాంతి వైపు వెళుతుంది. ఆటుపోట్లను తట్టుకుని నిదానంగా వెళుతుంది. జీవితం కూడా అలాంటిదే. చెట్ల వేర్లు బాగా విస్తరిస్తాయి. కనపడవు కాని చెట్టును బలంగా నిలబెడుతాయి. అలాగే మన వెనకుండే వారిని ఎప్పుడూ మరవ కూడదని హితవు పలికారు.
కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఏసురత్నం, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అనంతరాము, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చిరంజీవి చౌదరి, గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ, ఇతర ఉన్నతాధికారులు, శాఖాధికారులు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

సమస్యల పరిష్కారంతో ప్రభుత్వంపై నమ్మకం

Next Post

మియావకీ విధానంలో వనాల అభివృద్ధి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 7-11-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 7-11-2025

కార్యకర్త
@ November 7, 2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 6-11-2025

కార్యకర్త
@ November 6, 2025
దుబాయ్ లో ముగిసిన మంత్రి నారాయణ పర్యటన
ఆంధ్రప్రదేశ్

దుబాయ్ లో ముగిసిన మంత్రి నారాయణ పర్యటన

చైతన్యరధం
@ November 6, 2025
నాణ్యమైన విద్యుత్ అందించేందుకే సబ్ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన విద్యుత్ అందించేందుకే సబ్ స్టేషన్లు

చైతన్యరధం
@ November 6, 2025
జిల్లాల పునర్వ్యవస్థీకరణ..కసరత్తు తుదిదశకు!
ఆంధ్రప్రదేశ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణ..కసరత్తు తుదిదశకు!

చైతన్యరధం
@ November 6, 2025
ఇకపై ప్రతి శుక్రవారం.. ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్
ఆంధ్రప్రదేశ్

ఇకపై ప్రతి శుక్రవారం.. ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్

చైతన్యరధం
@ November 6, 2025
నూతన చేనేత బ్రాండ్.. ‘కొత్తూరు వసంత వర్ణ’
ఆంధ్రప్రదేశ్

నూతన చేనేత బ్రాండ్.. ‘కొత్తూరు వసంత వర్ణ’

చైతన్యరధం
@ November 6, 2025
ఏపీ తలెత్తుకునే ఘట్టం!
ఆంధ్రప్రదేశ్

మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత అమ్మ

చైతన్యరధం
@ November 6, 2025
Load More

ముఖ్య వార్తలు

జిల్లాల పునర్వ్యవస్థీకరణ..కసరత్తు తుదిదశకు!

జిల్లాల పునర్వ్యవస్థీకరణ..కసరత్తు తుదిదశకు!

చైతన్యరధం
@ November 6, 2025
ఇకపై ప్రతి శుక్రవారం.. ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్

ఇకపై ప్రతి శుక్రవారం.. ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్

చైతన్యరధం
@ November 6, 2025
రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాల ద్వారా..78వేల మందికి ఉద్యోగాలు

రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాల ద్వారా..78వేల మందికి ఉద్యోగాలు

చైతన్యరధం
@ November 6, 2025
అందరికీ సమానావకాశాలు

అందరికీ సమానావకాశాలు

చైతన్యరధం
@ November 6, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025 6:30 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

జగన్ తో.. జర జాగ్రత్త!

చైతన్యరధం
@ September 1, 2025 6:12 AM
అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దుబాయ్ లో ముగిసిన మంత్రి నారాయణ పర్యటన

దుబాయ్ లో ముగిసిన మంత్రి నారాయణ పర్యటన

చైతన్యరధం
@ November 6, 2025
నాణ్యమైన విద్యుత్ అందించేందుకే సబ్ స్టేషన్లు

నాణ్యమైన విద్యుత్ అందించేందుకే సబ్ స్టేషన్లు

చైతన్యరధం
@ November 6, 2025
జిల్లాల పునర్వ్యవస్థీకరణ..కసరత్తు తుదిదశకు!

జిల్లాల పునర్వ్యవస్థీకరణ..కసరత్తు తుదిదశకు!

చైతన్యరధం
@ November 6, 2025
ఇకపై ప్రతి శుక్రవారం.. ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్

ఇకపై ప్రతి శుక్రవారం.. ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్

చైతన్యరధం
@ November 6, 2025
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist