అమరావతి (చైతన్య రథం): చేనేత కార్మికులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీలు నెరవేర్చడం పట్ల
చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల 93 వేలమంది నేతన్నల గృహాలకు, 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేల సహకారం అందజేసేందుకు… అలాగే చేనేత కార్మికులకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటన్నింటినీ నెరవేర్చడానికి… చేనేతరంగ అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.138.08 కోట్లు కేటాయించడం జరిగింది. చేనేత కార్మికులకు నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సహకారాన్ని అందుకుని నేతన్నలు వృద్ధిలోకి రావాలని కోరుతున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.