అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వివరించారు.