అమరావతి (చైతన్య రథం): రోజువారీ నిత్యావసరాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం.. అంతటా సవరించిన శ్లాబ్‌లతో కూడిన జిఎస్టీ సంస్కరణలను కేంద్రం ప్రవేశపెట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘పేదలకు అనుకూలమైన వృద్ధి ఆధారిత నిర్ణయం.. రైతుల నుంచి వ్యాపారాల వరకు సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పరివర్తనాత్మక చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందిస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని మోదీ ప్రకటించినట్లుగా తదుపరి తరం జిఎస్టీ సంస్కరణలు మన పన్ను చట్రంయొక్క వ్యూహాత్మక, పౌర కేంద్రీకృత పురోగతిని సూచిస్తాయి. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారిస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.