* డైమండ్ జూబ్లీ వేడుకల్లో సీఎం చంద్రబాబు
* సంస్థ అధినేత ప్రభుకిశోర్ జీవిత ໖ The Winnarian ఆవిష్కరించిన సీఎం
విజయవాడ (చైతన్యరథం): ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ది చెందడానికి జీఎస్టీ సంస్కరణలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరుణ్ గ్రూప్ ఏర్పడి 75 ఏళ్ల పూర్తైన సందర్భంగా విజయవాడలో సోమవారం జరిగిన సంస్థ డైమండ్ జూబ్లీ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ సంస్థ అధినేత ప్రభు కిశోర్ జీవిత చరిత్ర The Winnarian ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మఖ్యమంత్రి మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగం సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రాన్ని భవిష్యత్లో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఏపీ నుంచే పెద్ద ఎత్తున ఉత్పత్తులు ఎగుమతి చేసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆటోమొబైల్ రంగంలో వరుణ్ గ్రూప్ ఎంతో ప్రగతి సాధించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చింది. ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి తొడ్పడతాయి. కొన్ని సంస్థలు మొదటి జనరేషన్లో మరికొన్ని రెండో జనరేషన్లో దెబ్బతిన్నాయి. చాలా తక్కువ సంస్థలే దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాయి. అలాంటి వాటిలో ఒకటి వరుణ్ గ్రూప్. నేటి పోటీ ప్రపంచంలో ఒక సంస్థ 75 ఏళ్ల ప్రస్థానమంటే అంత తేలికైన విషయం కాదంటూ ఆ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ను సీఎం చంద్రబాబు అభినందించారు.
కృష్ణా జిల్లా వాసులు తెలివైనవారు
75 ఏళ్ల క్రితం వరుణ్ గ్రూప్ ఇదే విజయవాడ నుంచి విజయయాత్ర మొదలుపెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం వాళ్లు అత్యంత తెలివైన వాళ్లు, సమర్థులు. కృష్ణాజిల్లా వాసులు దేశ, విదేశాల్లో వ్యాపార, వాణిజ్య, విద్యా, సినీ రంగాల్లో అద్భుతంగా రాణించారు. ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి విదేశాలు వెళ్లిన ఈ జిల్లావాసులు మళ్లీ వస్తారు. విశాఖ, విజయవాడల్లో అత్యుత్తమ హెూటళ్లు నిర్మించిన ప్రభుకిషోర్ అమరావతిలో కూడా నోవాటెల్ హెూటల్కు శంకుస్థాపన చేయడం శుభ పరిణామం. వేలాది మంది యువతకు వరుణ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి సహా పలువురు పారిశ్రామికవేత్తలు, వరుణ్ గ్రూప్ సిబ్బంది హాజరయ్యారు.