- ఎన్టీఆర్ భవన్‌లో కేక్ కట్ చేసిన నేతలు
- పాల్గొన్న మంత్రి గొట్టిపాటి, వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఏపీ మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు ఎం.ఏ. షరీఫ్ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి నాయకులకు తినిపిం చారు. పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దావోస్ పర్యటనలో నారా లోకేష్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి ఫలించాలి..రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రావాలి..రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాతర్ల రమేష్, ఏవీ రమణ, కోడూరి అఖిల్‌కుమార్, హసన్‌బాషా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.