- శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడ దాచారో గుర్తించండి
- జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతోంది..నిఘా వ్యవస్థలు పటిష్టం కావాలి
- ఇతర ప్రాంతాలు, నేపాల్‌లో దుంగలను వెనక్కు తెప్పించాలి
- అటవీ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశం
విజయవాడ : ఎర్రచందనాన్ని అడ్డగోలుగా నరికేసి జిల్లాలు, రాష్ట్రాలు దాటించి విదేశా లకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని, అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు వారి వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. ఇటీవల వైఎస్సార్ కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కడప జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. జగనన్న కాలనీలో దాచి ఉంచిన డంప్‌లో 158 ఎర్ర చందనం దుంగలు దొరికాయని, వీటి విలువ రూ.1.6 కోట్లు అని నివేదికలో పేర్కొన్నారు. దీంతో పవన్‌కళ్యాణ్ స్పందిస్తూ శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలను నరికేశారు.. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తిం చండి.. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఆదేశించారు. ఈ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచిం చారు. అలాగే ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు అందించాలని ఆదేశించారు. కేసు లు వీగిపోతే అందుకు కారణాలను పేర్కొనాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్ర చందనం దుంగలను తిరిగి తెచ్చుకోవ డంపైనా ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.