- ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు
- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
సాలూరు/పార్వతీపురం(చైతన్యరథం): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు. గురువారం సాలూరు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆత్మీయ సమావే శం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదువుకుని ఇంటర్‌లో 1000 మార్కులకు 967 మార్కులు వచ్చిన కె.రోహిత్ నాయు డును మంత్రి అభినందించారు. కె.రోహిత్‌నాయుడుకు అమరా వతి విట్స్‌లో ఇంజినీరింగ్ సీటు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు త్వ పాఠశాల, కళాశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిషన్ కిట్స్ ను మంత్రి ప్రారంభించారు. పాఠశాల, కళాశాలలో మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డ్వామా సంచాలకులు కె.రామచంద్రరావు, డీఈవో డి.రాజకుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు సత్యవతి, హైస్కూల్ హెడ్మాస్టర్ ఎన్.జ్యోతి, తహసీల్దారు బి.నీల కంఠారావు, ఎంపీడీవో జి.పార్వతి, ఎంఈవో ఎన్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.