- పట్టుదలతో సాధించిన మంత్రి లోకేష్
- 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి
- అధికారిక ప్రకటన విడుదల
- రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ ఛేంజర్
- డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా కీలక ముందడుగు
- అంతర్జాతీయ ఐటీ రంగంలో విశాఖకు కీలక గుర్తింపు
- మంత్రి లోకేష్ ఆలోచలనకు అనుగుణంగా విశాఖ డేటా సిటీ
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సాధించారు. ఆయన కృషి ఫలించింది. గత ఏడాది అక్టోబర్‌లో అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ చర్చలు ఫలించాయి. ఆసియాలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. 50వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి. ఇది రాష్ట్రం గర్వించదగిన విషయం. దీనిపై గురువారం అధికారిక ప్రకటన వెలువడిరది. విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధారించింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో నిర్మాణం కానుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. మూడు సముద్రపు కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్ ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ‘డేటా సిటీ’ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్‌కు ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఐటీ రంగంలో కొత్త మైలురాయిగా నిలవనుంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడుతున్న విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ‘‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’’ దిశగా ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. 24 గంటల విద్యుత్ సరఫరా, అత్యాధునిక కూలింగ్ సిస్టమ్‌లు, సైబర్ సెక్యూరిటీ రక్షణలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ఇది కేంద్ర బిందువుగా నిలవనుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలు అయితే, లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా బహుళజాతి టెక్ దిగ్గజాలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయింపు, విద్యుత్`నీటి సౌకర్యాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వేగంగా లభిస్తున్నాయి. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిరచాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో ప్రముఖ స్థానం సంపాదించనుంది. టెక్నాలజీ రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదగడమే కాకుండా, ‘‘డిజిటల్ సిటీ’’గా గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్ తీర నగరం అయిన విశాఖపట్నం త్వరలో ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ రాబోతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇప్పటికే పతాక శీర్షికల్లో ప్రధానంగా పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా కూడా అతి పెద్ద పెట్టుబడితో రానున్న ఈ ప్రముఖ కేంద్రం పలు టెక్ దిగ్గజాలను ఆకట్టుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో టెక్ దిగ్గజాలు, గ్రీన్ ఎనర్జీ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు రావడం వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతర శ్రమ ఉందనేది నిర్వివాదాంశం.
ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం
6 బిలియన్ డాలర్ల పెట్టుబడి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం కలుగుతుంది. ఇతర అంతర్జాతీయ టెక్ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు కచ్చితంగా ఆసక్తి చూపిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, డేటా మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, మెయింటెనెన్స్ రంగాల్లో వేలకొద్దీ ప్రత్యక్ష ఉద్యోగాలు, రవాణా, హోటల్స్, సప్లయి చైన్, చిన్న వ్యాపారాలు వంటి పరోక్ష ఉద్యోగాలు లక్షల్లో సృష్టించబడతాయి. స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ, హై-స్పీడ్ ఇంటర్నెట్, కన్‌స్ట్రక్షన్, సప్లయి వంటి రంగాలకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. స్థానిక యువతకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణా అవకాశాలు లభిస్తాయి. విశాఖ ‘‘టెక్ ఎడ్యుకేషన్ హబ్’’గా గుర్తింపు పొందే అవకాశం వస్తుంది.
పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుకూలమైనది. మొత్తం 6 బిలియన్ డాలర్ల పెట్టుబడిలో, 2 బిలియన్ డాలర్లను ప్రత్యేకంగా రెన్యువబుల్ ఎనర్జీ (సౌర, పవనశక్తి) అభివృద్ధికి కేటాయించారు. దీని ద్వారా డేటా సెంటర్ కు అవసరమైన విద్యుత్ ను ఎక్కువ భాగం కాలుష్యరహిత శక్తితో ఉత్పత్తి చేస్తారు. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను 2030 నాటికి నికర-సున్నా ఉద్గారాలకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడి ఆ లక్ష్యంలో ఒక భాగం.
నగర అభివృద్ధి వేగవంతం
ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇస్తుంది. ఆధునిక మౌలిక వసతుల కల్పనతో విశాఖ నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, హై-స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా నగరం అభివృద్ధితో దూసుకెళుతుంది. క్లౌడ్ సేవలు మెరుగుపడటంతో స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు తమ వ్యాపారాలను మరింత సమర్థవంతంగా ఇక్కడికే వచ్చి నిర్వహించుకోగలుగుతాయి. అంతే కాకుండా విశాఖ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. అంతర్జాతీయ ఐటి మ్యాప్‌లో స్థానం దక్కుతుంది. రాష్ట్రం ‘‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’’గా పేరు తెచ్చుకుంటుంది.
అదే సమయంలో విద్య, పరిశోధనకు మరింత ప్రోత్సాహం దక్కుతుంది. విశాఖలోని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు గూగుల్‌తో కలిసి ఆధునిక పరిశోధనల్లో భాగమయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రభావం చూస్తే రాష్ట్ర జీడీపీ వృద్ధి వేగవంతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలోనే డిజిటల్, టెక్నాలజీ హబ్‌గా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగం వల్ల సుస్థిరాభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ ప్రాజెక్ట్ ఆర్థిక అభివృద్ధి, టెక్నాలజీ పురోగతి, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం, ఆధునిక విద్యావకాశాలు అన్నీ సమన్వయం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ‘‘గేమ్ ఛేంజర్’’గా నిలుస్తుంది.