29, 30 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పర్యటనలు
ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు
సెప్టెంబరు 15 నాటికి సీఎంకు తుది నివేదిక
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై వచ్చే నెల 15 తేదీ నాటికి తమ నివేదిక సీఎం చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం(జీవోఎం) నిర్ణయించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు ఏడుగురు మంత్రులతో ఏర్పాటైన జీవోఎం తొలిసారిగా బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి అనగానితో పాటు మంత్రులు పి.నారాయ ణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్‌రెడ్డి, నిమ్మల రామా నాయు డు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌తో పాటు రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిసెంబర్ 31 లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ మొత్తంగా ముగించాల్సి ఉన్నందున జీవోఎం తన నివేదికను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి సీఎం చంద్రబాబుకు అందజేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్వీభజన సక్ర మంగా చేయని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతు న్నారని, వాటన్నింటిని సరిచేసేందుకే జీవోఎంను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో మంత్రుల బృందం రెండు గ్రూపులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తుందని, ఆ సమ యంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వచ్చిన అనేక సూచనలపై చర్చించామని, రానున్న కాలంలోనూ వినతులు స్వీకరించి వాట న్నింటినీ క్రోడికరించి సెప్టెంబర్ 15 నాటికే నివేదికను సీఎంకు అందజేస్తామని చెప్పారు.
ప్రజలు ఇప్పటి నుండే కలెక్టర్లకు తమ వినతులను ఇవ్వవచ్చునని, వినతులకు సెప్టెంబరు 2 అఖరు తేదీ అని చెప్పారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామాల పేర్లు, సరిహ ద్దుల మార్పులతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా జీవోఎం పరిశీలిస్తుందని చెప్పారు. అయితే నియోజకవర్గాలతో జీవోఎంకు సంబంధం లేదని, వాటి జోలికిపోవడం లేదని తెలిపా రు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లక్ష్యంగా తమ సూచనలు ఉంటాయని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు గిరిజనులకు అందుబాటులో ఉండేవిధంగా రెండు గిరిజన ప్రాంతాలను కూడా మంత్రుల బృం దం పర్యటించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పారు.
ప్రజల నుంచి వినతులు
జీవోఓం సమావేశం జరుగుతూ ఉండగానే దాదాపు 15 మంది జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పుపై మంత్రుల బృందానికి తమ వినతులను సమర్పించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని వినతిపత్రం సమర్పిం చారు. అలాగే చీరాల నుంచి వచ్చిన కొందరు బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని, బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పెట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా మురపాక నుంచి వచ్చిన బిఎస్ నాయుడుతో పాటు ఆ గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. కృష్ణా జిల్లా మడిచర్ల గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఆ గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని బాపులపాడు మండలం నుంచి తీసేసి నూజివీడు మం