- సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి నూతన కాలండర్ ఆవిష్కరణ
అమరావతి (చైతన్యరథం): స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ వ్యవస్థలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు పట్టుకొమ్మ లుగా నిలవాలని ఆశాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడి సచివాలయం లోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ నూతన క్యాలెండర్ , డిఎస్బీవీ స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డిఎస్ బీవీ స్వామి మాట్లాడుతూ… స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ వ్యవస్థలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు పట్టుకొమ్మలుగా నిలవాలన్నారు. సిబ్బంది ప్రజ లకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టాం. జిల్లా, డివిజన్, మండల, స్థాయిల్లో మూడంచెల వ్యవస్థ తీసుకొచ్చాం. ఉద్యోగులందరికీ బదిలీలు, పదోన్నతుల కల్పనకు చర్యలు చేప ట్టాం. ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి డిఎస్బీవీ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ కార్యదర్శి కాట మనేని భాస్కర్, డైరెక్టర్ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.















