అమరావతి (చైతన్యరథం): గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును తన అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యు సిటీకి భూమిని ఇచ్చినందుకు అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు.















