అమరావతి (చైతన్యరథం): దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని సీఎం చంద్రబాబును విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేతలు కోరారు. వీహెచ్‌పీ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు.. సీఎం చంద్రబాబుని కలిసి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే విషయమై వీహెచ్‌పీ రూపొందించిన ముసాయిదా ప్రతిని అందించారు. అంతే కాకుండా విజయవాడలో వచ్చే ఏడాది జనవరి 5న జరగబోయే ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభ వివరాలను కూడా తెలియజేశారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో గుమ్మళ్ళ సత్యం, శ్రీవేంకటేశ్వర్లు, దుర్గ ప్రసాద రాజు, రవికుమార్ ఉన్నారు.