- అలాంటి అధికారులు చాలా మంది ఉన్నారు
- అడ్డగోలు అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకునేలా టీడీపీ పోరాడుతుంది
- పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి్డలపైనా చర్యలు తీసుకోవాలి
- ఎన్నికలయ్యాక జగన్ దేశం విడిచి పోతాడు
- అతన్ని నమ్మి తప్పులు చేస్తున్న అధికారులు ఎక్కడికి పోతారు?
అమరావతి: జగన్మోహన్‌రెడ్డి తన రాజకీయ ప్రయో జనాల కోసం అధికారులను వాడుకుంటున్నాడని, ఈ వాస్తవం గ్రహించి నిబంధనల ప్రకారం నడుచుకోకుం టే అధికారులు జైలుపాలవడమో, సస్పెండ్ కావడమో ఖాయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఇచ్చి న ఫిర్యాదు వాస్తవం కాబట్టే ఐఏఎస్ అధికారి గిరీశాను ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెండ్ చేసింది. తెలుగు దేశం – జనసేన పార్టీల గెలుపును పసిగట్టే జగన్‌రెడ్డి దొంగఓట్లను నమ్ముకున్నాడని విమర్శించారు. అధికా రులు, వాలంటీర్ల సాయంతో దొంగ ఓట్లు చేర్పిస్తున్నా డన్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైసీపీ ఏ విధంగా దొంగఓట్లతో గెలిచిందో ప్రజలు చూశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఆదేశాలు, బెదిరిం పులతోనే కొందరు అధికారులు దొంగఓట్లు సృష్టించి, వాటిని వేయించిన వైనాన్ని ఆధారాలతో సహా తెలుగు దేశం ఎన్నికల సంఘం ముందు ఉంచింది. వైసీపీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరుని టీడీపీ పలు సందర్భాల్లో సాక్ష్యాధారా లతో సహా బయటపెట్టింది. తిరుపతి ఉపఎన్నికలో 30 వేల ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఆనాడు ఎన్నికల రిటర్నిం గ్ అధికారిగా వ్యవహరించిన గిరీశా లాగిన్ ఐడీ నుం చే డౌన్ లోడ్ అయినట్టు నిర్ధారణకు వచ్చాకే, ఎన్నికల సంఘం సదరు అధికారిని సస్పెండ్ చేసింది. గిరీశా లానే జగన్‌రెడ్డికి సహకరిస్తూ, అతను చెప్పినట్టు పని చేస్తున్న మరికొందరు అధికారులపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామని బొండా తెలిపారు.
ఎన్నికల సంఘం వేటు వేశాక ముఖ్యమంత్రి కూడా కాపాడలేడు
ఎన్నికల సంఘం ఏ అధికారిని సస్పెండ్ చేసినా.. వారికి ముఖ్యమంత్రి కూడా తిరిగి పోస్టింగ్ ఇచ్చే అవ కాశం లేదు. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పక్షపాతం లేకుండా చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. జగన్మోహన్‌రెడ్డిని నమ్మి, అతని అవి నీతిలో భాగస్వాములైన శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, రాజ గోపాల్, శామ్యూల్ వంటి ఐఏఎస్ అధికారులు ఇస్ప టికీ కోర్టులచుట్టూ తిరుగుతున్నారు. కళ్లముందు కొంద రు అధికారులు పడుతున్న బాధలు చూస్తూ కూడా పోస్టింగులు, ప్రమోషన్ల కోసం, ఇతరత్రా ప్రలోభాలకు లొంగి తప్పులుచేస్తే అధికారులు భారీ మూల్యం చెల్లిం చుకుంటారు. ఎన్నికలు ముగిశాక జగన్‌రెడ్డి వేరే దేశా నికో, వేరే రాష్ట్రానికో పారిపోతాడు. తప్పుచేసిన అధి కారులు ఎక్కడికి పోతారని బొండా ప్రశ్నించారు.
సస్పెండ్ కావడమో… జైలు కెళ్లడమో ఖాయం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం ఆర్జేడీగా ఉన్న ప్రతాపరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ కల్పనా రెడ్డి భర్త. అతను ఒళ్లూ..పై తెలియకుండా ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. గిరీశాపై ఫిర్యాదు చేసినట్టే టీడీపీ గతంలోనే ప్రతాపరెడ్డిపై కూడా ఎన్ని కల సంఘానికి ఫిర్యాదు చేసింది. తిరుపతి కలెక్టర్ వెంకటరామిరెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణపై, తిరుపతి ఆర్డీవో కనక నర్సారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి కూడా జాబితాలో ఉన్నాడు. ఇతనైతే మరీ ఖాకీచొక్కా లోపల వైసీపీ కండువా ఉన్నట్టే విధినిర్వహణ చేస్తున్నాడు. వారు చేసిన తప్పులు.. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఎన్నికల సంఘం ముందు ఉంచాము. మున్సిపల్ కమిషనర్‌గా తిరుపతిలో పనిచేసినప్పుడు గిరీశా చేసిన తప్పులకు నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్నా కూడా సస్పెండ్ అయ్యాడు. ప్రతాపరెడ్డి ఈ వాస్తవం గ్రహిస్తే మంచిది. తప్పుచేసిన అధికారులు ఎవరూ తప్పించుకోలేరు. కులపిచ్చితో విధినిర్వహణకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రతి అధికారి, కచ్చితంగా సస్పెండ్ కావడమో… జైలుకెళ్లడమో ఖాయం. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ అధికారి ఇంతగా బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. రెచ్చిపోయి కులపిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించలేదని బొండా అన్నారు.
తప్పులుచేయించిన వారిపైనా చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మరో పదిరోజుల్లో రానుంది. జగన్ రెడ్డి చెప్పాడని ఇష్టానుసారం ప్రవర్తించే ఏ అధికారి అయినా శిక్షార్హుడే. పిచ్చపిచ్చ వేషాలు వేసే అధికారులు సర్వీస్ నుంచి రిమూవ్ కావడం.. సర్వీస్ పై మాయనిమచ్చ అంటించుకోవడం కూడా ఖాయం. సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకట్రామిరెడ్డిని కూడా ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. గిరీశాపై చర్యలు తీసుకున్నట్టే, ప్రతాపరెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. వారు చేసిన తప్పులు..వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఎన్నికల సంఘం ముందు ఉంచబోతున్నాం. జగన్ రెడ్డి అండతో అధికారులు చేసిన తప్పులకు అంతేలేదు. 5వ తరగతి చదివిన తిరుపతి కౌన్సిలర్ కు గ్రాడ్యుయేట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.
గిరీశాను ఒక్కడినే సస్పెండ్ చేస్తే సరిపోదు.. అతనితో తప్పులుచేయించిన మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అతని కొడుకుపై కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసులు పెట్టి, అదుపులోకి తీసుకొని విచారించాలి. గిరీశా అనే అధికారి ఒక్కడే తప్పు చేశాడని చెప్పలేం. అతన్ని వేధించి, ప్రలోభపెట్టి తామనుకున్నది చేసిన పెద్దిరెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఎన్నికల సంఘం కఠినంగా శిక్షించాలి. ప్రజల ఛీత్కారం తప్పదని గ్రహించే జగన్‌రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, దొంగఓట్ల ద్వారా గెలవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యమంత్రి అండతో తప్పులుచేసే అధికారులకు శిక్ష తప్పదు. నియోజవకర్గాల వారీగా టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి, మరికొందరు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉందని బొండా చెప్పారు.
అధికారులు బలి కావొద్దు
అలానే ఉరవకొండ నియోజకవర్గంలోని దొంగఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అక్కడ ఒక ఆర్డీవోను, ఎమ్మార్వోను సస్పెండ్ చేశారు. ఇంకా కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. పర్చూరు నియోజకవర్గంలో గంపగుత్తగా ఫామ్-7 దరఖాస్తులు అప్ లోడ్ చేసి, దాదాపు 12వేల టీడీపీ ఓట్లను తొలగించారు. ఆ ఘటనకు సంబం ధించి ఎన్నికల కమిషన్ ఒక సీఐని, ఒక ఎస్‌ఐని మాత్రమే సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రమే యమున్న మరికొందరు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 17వేల దొంగఓట్లు చేర్చారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు 10వేల వరకు తొలగించారు. పిఠాపురం నియో జకవర్గంలో 28బూత్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారు.
కావలిలో ఒకే పోలింగ్ బూత్ పరిధిలోని 500 ఓట్లను తొలగించారు. కాకినాడలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అర్హుల ఓట్లు తొల గించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తప్పులు.. తమ దృష్టికి వచ్చిన అనేక ఘటనలపై గత ఏడాది మార్చి 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేశాం. తర్వాత కూడా అనేక ఫిర్యాదులు అందిం చాం. జగన్‌రెడ్డి అతని పంచన ఉండే దొంగల్ని నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దని అధికారుల్ని బొండా హెచ్చరించారు.
83 రోజుల తర్వాత జగన్‌రెడ్డి సహా ఎవరూ కనిపించరు
కొడాలినానీ వేస్ట్ ఫెలో. అతను ఫ్రస్టేషన్లో ఉండి నోరు పారేసుకుంటున్నాడు. గుడివాడలో జరిగిన టీడీపీ ‘రా..కదలిరా’ సభకు లక్షకు పైగా జనం వచ్చారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ బలం చూడలేని దుస్థితిలో కొడాలి నానీ ఉన్నాడు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నానీకి ఇంకా అధికారం తాలూకా అహంకారపు పొర లు తొలగిపోలేదు. అందుకే టీడీపీ సభకు జనం రాలే దంటున్నాడు. నానీ లాగా ఎవడు ఎంతగా రెచ్చిపోయి నా ఇంకా వాళ్లకు మిగిలింది 83 రోజులే. తర్వాత జగన్‌రెడ్డి.. పెద్దిరెడ్డి… సజ్జల సహా ఏ ఒక్కరూ కనిపిం చరని బొండా ఉమా స్పష్టం చేశారు.