- సంస్థను ఏపీకి విస్తరించాలని ఏ బీమ్ కన్సల్టింగ్ ఎండీకి ఆహ్వానం
సింగపూర్ (చైతన్య రథం): ఎ బీమ్ కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ యానో టోమోకాజుతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఐటీ సహా డాటా సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో జీసీసీ సెంటర్ల ఏర్పాటుకు పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్న విషయాన్ని యానోతో చర్చించారు. ఇటీవల ఎఎన్‌ఎస్‌ఆర్ సంస్థ విశాఖలో జీసీసీ ఏర్పాటుకు ఎంఓయు కుదుర్చుకున్న విషయాన్నీ ప్రస్తావించారు. జీసీసీలకు అన్నివిధాలా అనుకూలమైన ఎకోసిస్టమ్ కలిగిన విశాఖపట్నంలో ఎ బీమ్ కన్సల్టింగ్ సంస్థ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్, కాస్ట్ అడ్వంటేజ్‌ను పరిగణనలోకి తీసుకొని ఎ బీమ్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సేవలకు విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. దీనిపై ఎ బీమ్ కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ యానో టోమోకాజు స్పందిస్తూ… తమ సంస్థ స్ట్రాటజీ, మేనేజ్‌మెంట్ ఐటీ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్, ఏఐ, క్లౌడ్, సెక్యూరిటీ, అవుట్ సోర్సింగ్ సేవలను అందిస్తుందని వివరించారు. సింగపూర్, థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాంలో తమ సంస్థకు దాదాపు 1200మంది నిపుణులైన కన్సల్టెంట్లు ఉన్నారన్నారు. భారత్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, శాప్ ఆధారిత సేవలను అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తగురీతిన పరిశీలిస్తామని మంత్రి లోకేష్‌కు ఎండి యానో హామీ ఇచ్చారు.