- మేం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల్ని పునరుద్ధరించాం
- విఘాతం కలిగిస్తే ఉపేక్షించేంది లేదు
- తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి (చైతన్యరథం) : శాంతి,భద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఏపీ రాజకీయాలను నేరమయం చేసిన సంస్మృతి వైసీపీదే. వైసీపీ పాలనంతా చట్టరహితంగానే కొనసాగింది. నేరమయ రాజకీయాలు వైసీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్టవిరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది. ప్రజలకు సేవ చేయటం వారికి సాధికారత కల్పించటం మా సిద్దాంతం. వైసీపీ నిజ స్వరూపం బయటపడుతున్న కొద్దీ అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు పునర్నిర్మాణం జరుగుతున్న తీరును చూసి ఓర్వలేక పోతున్నారు. రాజ్యాంగమే సుప్రీం. మేం నెలకొల్పిన శాంతిభద్రతల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతాం. చట్ట ఉల్లంఘనలకు ఎవరినీ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.















