- వృద్ధిరేటులో దేశంలోనే రెండో స్థానం
- 8.21 శాతం వృద్ధిరేటు నమోదు
- దార్శనికుడు చంద్రబాబు నేతృత్వంలో ఏడాదిలోనే 2.02 శాతం పెరుగుదల
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో వెల్లువెత్తుతున్న పెట్టుబడులు
- అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకూ పెట్టుబడుల విస్తరణ
- రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాటలు
అమరావతి (చైతన్యరథం): దార్శనికుడి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసానికి పరుగులు తీస్తోంది. అరాచకం నుంచి అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్ అసమర్థ, విధ్వంసపూరిత రాజకీయమే ప్రధాన అడ్డంకి అనే విషయం మరోసారి నిరూపితమయింది. అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే.. ఏపీ పరుగులు పెడుతుందని మరోసారి నిరూపితమయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యధిక వృద్ధి రేటును ఏపీ సాధించింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడు తర్వాత మన రాష్ట్రమే ముందు ఉంది.
దేశంలో వృద్ధిరేటు పరంగా టాప్ లిస్ట్‌లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన గ్రోత్ రేట్‌లో ఏపీ రెండో స్ధానంలో ఏపీ ఉంది. కాన్‌స్టెంట్ ప్రైసెస్‌లో 8.21శాతం గ్రోత్ రేట్‌తో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతం గ్రోత్ రేట్‌తో దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఏపీ గ్రోత్ రేట్‌ను నిర్ధారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ నివేదికలో ప్రస్తావించింది. వైసీపీ హయాంలో ఏపీలో కేవలం 6.19 శాతం గ్రోత్ రేట్ మాత్రమే ఉంది. ఏడాది కాలంలో 2.02 శాతం పెరిగి 8.21 శాతంగా నమోదైంది. కరెంట్ ప్రైసెస్ విభాగంలో 12.02 శాతంగా ఏపీ గ్రోత్ రేట్ నమోదైంది. విస్తృత అధ్యయనం తరువాతే కేంద్రం ఈ గణాంకాలను విడుదల చేస్తుంది. జీఎస్డీపీ డేటాను తీసుకుని అంచనా వేస్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువే జీఎస్డీపీ.
15 శాతం వృద్ధిరేటు లక్ష్యం
అంధ్రప్రదేశ్‌ను ఒకవైపు విభజన గాయం మానకముందే, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో 2017-18 నాటికే అద్భుతమైన రెండంకెల 10.09 శాతం వృద్ధి రేటును సాధించి దేశం దృష్టిని ఆకర్షించాం. కానీ ఆ తర్వాత 2019లో అబద్ధాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టి, అభివృద్ధిని విస్మరించి, ఇసుకకు కృత్రిమంగా కొరత సృష్టించి, ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. రాష్ట్రంలో అభివృద్ధి కుదేలయింది. జగన్ పాలనలోని ఆ విధ్వంసానికి కరోనా మహమ్మారి తోడై 2020-21 నాటికి వృద్ధి రేటు 1.52 శాతానికి పడిపోయి రాష్ట్రం అగాధంలో కూరుకుపోయింది. 2024లో అఖండ మెజారిటీతో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 15 శాతం వృద్ధి సాధించాలని దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర `2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ప్రగతిపై నిరంతరం సమీక్షలు చేసుకుంటూ, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఒక్కో అడుగు వేస్తూ, చిన్న విజయాలను కూడా సంబరంగా జరుపుకుంటూ, పట్టుదలతో ప్రయత్నించి ఆ అగాధం నుండి లేచి నిలబడ్డాం. వ్యవసాయ రంగం, పరిశ్రమలు నూతన శక్తితో ఊపిరి పోసుకున్నాయి. సేవా రంగం కూడా విస్తరిస్తోంది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.
పెట్టుబడుల వెల్లువ
గత ప్రభుత్వం చాలా కీలక రంగాల్లో నిర్ణయాలు తీసుకోకుండా.. కనీసం పాత ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఆపేసింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే ముందుగా అలాంటి సమస్యలను పరిష్కరించింది. అలాగే పెట్టుబడులు పెరగడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేలా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్రానికి దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ ఆచరణలోకి వస్తున్నాయి కూడా. వీటివల్ల రాష్ట్ర యువతకు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా పరిశ్రమలను రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాల ఫలితంగా పెట్టుబడులు రావటమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అవి విస్తరిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఈ స్పీడ్ కొనసాగితే రానున్న రోజుల్లో ఏపీ తమిళనాడును కూడా మించిపోతుంది. 2014-19 మధ్య కూడా ఏపీ అభివృద్ధిలో పరుగులు తీసింది. కానీ వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే సమీకరించుకున్న వేల కోట్ల నిధులతో రాజధాని పనులు మొదలవుతున్నాయి. పోలవరంతో పాటు అనేక మౌలిక వసతుల నిర్మాణాలు మొదలయ్యాయి. దేశానికి గ్రోత్ ఇంజిన్ అవుతున్న ఏపీకి చంద్రబాబు నాయకత్వం ఉన్నంత కాలం అభివృద్ధిలో పరుగులు తీయటం ఖాయం.