- తల్లికి వందనం పెండిరగ్ నిధులు రూ. 325 కోట్లు విడుదల
- గత 14 నెలల్లో సమర్థవంతంగా సంస్కరణల అమలు
- ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదే
- దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మౌలిక సదుపాయాలు
- అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు
- ఫీజు రీ యింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల
- విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి విజయవంతంగా నిర్వహించాం.. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీచేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై రాష్ట్రస్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృథా చేయవద్దన్నారు. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశాం. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉంది. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉంది, ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
తల్లికి వందనం చివరి దశ నిధుల విడుదల
తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి విడతగా పెండిరగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ. 325 కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీ యింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీ స్కూల్ పాలసీని సిద్ధంచేయండి. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్, స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలి. ఇందుకోసం శాప్ సహకారం తీసుకోండి. రాజ్యాంగ దినోత్సవం నాడు అసెంబ్లీ లో విద్యార్థులచే ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి స్పీకర్ అనుమతితో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విద్యార్థులను ఎంపిక చెయ్యాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
మౌలిక సదుపాయాలకు దాతల సహకారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల (జతీఱ్‌ఱషaశ్రీ ఱఅటతీaర్‌తీబష్‌బతీవ) అభివృద్ధికి దేశ, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలి. ఆసక్తిగల వారు తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలికసదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్ సైట్ రూపొందించాలి. జాతీయస్థాయిలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలి. రాష్ట్రంలోని అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప, చిత్తూరులలో ఆధునీకరించిన సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించి, విద్యార్థులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దండి. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 125 ఆటిజం సెంటర్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, ఏడాదిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
దేశంలోనే అత్యుత్తమంగా సెంట్రల్ లైబ్రరీ
దేశంలోనే అత్యుత్తమ మోడల్‌తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలి. 2లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేస్తున్న ఈ లైబ్రరీ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోండి. విశాఖపట్నం జగదాంబ సెంటర్‌లో ప్రతిపాదించిన రీజనల్ లైబ్రరీని 50వేల అడుగుల్లో నిర్మించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ చర్చించారు. పబ్లిక్ లైబ్రరీల్లో నిర్ణీత సమయాలను కచ్చితంగా అమలుచేసేలా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలుచేయండి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం 13మాత్రమే జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా గ్రంధాలయాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ గ్రంథాలయాలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ కామన్ సాఫ్ట్‌వేర్, వెబ్‌సైట్ రూపొందించాలి. అందులో పెండిరగ్ ఇన్‌ఫ్రాస్ట్చక్చర్, బుక్ యాక్సెస్, లైబ్రరీ మేనేజ్‌మెంట్ వివరాలను అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేష్ సూచించారు.
సెస్సు నిధులతో లైబ్రరీల అభివృద్ధి
స్థానిక సంస్థలనుంచి సుమారు రూ.213 కోట్ల రూపాయల మేర సెస్సు బకాయిలు పెండిరగ్‌లో ఉన్నాయి. వాటిని రాబట్టి లైబ్రరీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లైబ్రరీల్లో విజ్జానవంతమైన కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి. నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీ నుంచి రాష్ట్రానికి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో రాజమండ్రి గ్రంథాలయానికి రూ.87లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీల్లోని పుస్తకాలతో పోటీ పరీక్షలకు సిద్ధమైన 350మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు లభించాయి. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలి. పోటీపరీక్షలకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దీవెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.